పాలు, పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇవి ఎముకల ఆరోగ్యాన్ని నిర్మించడంలో సహాయపడతాయి. పాల ఉత్పత్తులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అవి బలమైన, దృఢమైన ఎముకలను నిర్మించడంలో సహాయపడతాయి.పండ్లు, కూరగాయలతో పాటు పాల ఉత్పత్తులను కూడా తప్పరిసరిగా తీసుకోవాలి. ఇది అధిక రక్తపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది.పేగుల ఆరోగ్యానికి ప్రోబయోటిక్స్ అవసరం. పాల నుంచి జున్ను, పెరుగు, లస్సీ, నెయ్యి, వెన్న వంటి ఆహారాన్ని తయారు చేస్తారు. కానీ నెయ్యి-వెన్న, జున్ను ఎక్కువగా తినడం ప్రమాదకరం. అందుకే ఏ ఆహారం తింటే ఎలాంటి లాభాలు పొందుతారో తెలుసుకోవాలి. అప్పుడే ఆహారం సమతుల్యంగా ఉంటుంది.పుల్లని పెరుగు నుంచి పోషకాహారం లభిస్తుంది. పుల్లటి పెరుగు తింటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి.వెన్నలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. సంతృప్త కొవ్వులు కూడా ఉంటాయి. కాబట్టి తక్కువ మోతాదులో వెన్న తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.


వంటల్లో వెన్న, నెయ్యిని ఉపయోగించవచ్చు.నెయ్యి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నెయ్యిలో అధిక మొత్తంలో కొవ్వు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెకు మేలు చేస్తాయి. ఆహారంలో కొద్ది మొత్తంలో నెయ్యి తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగవు.క్యాల్షియం, ప్రొటీన్‌లతో పాటు పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఈ ఆహారం పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పుల్లటి పెరుగు జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియాను పెంచడానికి సహాయపడుతుంది. ఓట్స్, పండ్లను పుల్లని పెరుగుతో కలిపి తినవచ్చు. లేదా స్మూతీ తయారు చేసి తినవచ్చు. కానీ అందులో చక్కెర కలపకూడదు.చీజ్‌లో ప్రొటీన్, క్యాల్షియం ఉంటాయి. చీజ్‌లో విటమిన్ ఎ, బి12, జింక్ కూడా ఉన్నాయి. ఇంట్లో తయారుచేసిన పిజ్జా, పాస్తా, శాండ్‌విచ్‌లు వంటి ఆహారాలలో చీజ్ కలపవచ్చు.అధిక మొత్తంలో ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్ బి12, విటమిన్ డి పాలలో ఉంటాయి. ఈ పానీయంలో ఫాస్ఫేట్, పొటాషియం కూడా ఉంటాయి. టీ, కాఫీలలో పాలు కలపడడానికి బదులు.. పాలల్లో పసుపు పొడి కలుపుకుని తాగితే ప్రయోజనాలు పొందవచ్చు. తక్కువ కొవ్వు పాలు తాగేందుకు ప్రయత్నించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: