మార్చి 7వ తేదీన ఒక్కసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు.. ఎన్నో  ముఖ్య సంఘటనలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్రలోకి  వెళ్లి ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 మహిళా క్రికెట్ వరల్డ్ కప్ : 2009 మార్చి 7వ తేదీన ప్రపంచ మహిళల వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఆస్ట్రేలియాలో ప్రారంభమైంది. 

 

 యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలు : 2011 మార్చి 7వ తేదీన యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కాగా ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట క్షేత్రం మరింత అభివృద్ధి చెందింది. 

 

 

 ఎమ్మెస్ రామారావు జననం  : తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి నేపథ్య సంగీత గాయకుడు అయిన ఎమ్.ఎస్.రామారావు 1961 మార్చ్ 7వ తేదిన జన్మించారు. ఈయన పూర్తి పేరు మోపర్తి  సీతారామారావు. ఈయనకు సుందరదాసు అనే బిరుదు కూడా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి నేపథ్యగాయకుడు అయినా ఎమ్మెస్ రామారావు 1944లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత అయిన వైవి రావు  చిత్రంలో మొదటిసారిగా ఈ రేయి నన్నోళ్ల నెరవ రాజా అనే ఎంకి పాట  పాడించారు. గేయ  రూపంలో ఆయన రచించిన  రామాయణం సుందరకాండ ఎమ్మెస్ రామారావు సుందరాకాండ సుప్రసిద్ధ. హనుమాన్ చాలీసా తెలుగులో అనువదించి పాడారు ఎమ్మెస్ రామారావు. ఈ రెండు ఆయనకు మంచి గుర్తింపును ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఈయన 1992 ఏప్రిల్ 20వ తేదీన మరణించారు. 

 

 

 డేవిడ్ బాల్టిమోర్ జననం : అమెరికా దేశానికి చెందిన జీవ శాస్త్రవేత్త మరియు నోబెల్ బహుమతి గ్రహీత అయిన డేవిడ్ బాల్టిమోర్ 1938 మార్చి 7వ తేదీన జన్మించారు.న్యూయార్క్ నగరంలో జన్మించారు ఈయన. 1956 సంవత్సరంలో పట్టభద్రుడైన డేవిడ్ బాల్టిమోర్ జీవిత శాస్త్రంలో శ్రద్ధ కనబర్చి జాక్సన్ ప్రయోగాలలో ప్రవేశించారు. ఇతను స్వార్త్  మోర్ కళాశాలలో బీఏ డిగ్రీ ని 1960లో పొంది రాకే పిల్లర్  విశ్వవిద్యాలయం నుంచి 1964లో పీహెచ్డీ సంపాదించారు. ఈయన జీవశాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేసి విజయం సాధించారు. ఇక జీవశాస్త్రంలో ఈయన పరిశోధనలకు చేసిన సేవలకుగాను ఏకంగా నోబెల్ బహుమతి అందుకున్నారు. 

 

 

 వివియన్ రీఛర్డ్  జననం : వెస్ట్ఇండీస్ కు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు ఆయన వివియన్ రిచర్డ్స్ 1952 మార్చి 7వ తేదీన జన్మించారు. 2002లో వివియన్ రిచర్డ్స్ వన్డేలలో సర్వకాల అత్యున్నత బ్యాట్స్మెన్ గా గుర్తింపు పొందాడు. ఇక ఆ తర్వాత 2003 సంవత్సరంలో భారత క్రికెట్ జట్టుకు చెందిన సచిన్ టెండూల్కర్ కు  ప్రథమ స్థానం రాగా అతనికి  ద్వితీయ స్థానంలో సరిపెట్టారు. వెస్ట్ ఇండీస్ టీం తరఫున ఎన్నో మ్యాచ్ లలో  తనదైన అద్భుత ప్రదర్శనతో రాణించారు వివియన్ రిచర్డ్స్. వివియన్ రిచర్డ్స్ తన తొలి టెస్టు ను  1974లో భారత్ పై బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆరంగేట్రం చేశాడు. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో ఏకంగా 192 పరుగులతో నాటౌట్ గా  నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. మొత్తం అతడు 121 టెస్టుల్లో  50.23 సగటుతో 8540 పరుగులు చేశాడు. అందులో 24 సెంచరీలు 45 హాఫ్ సెంచరీలు  ఉన్నాయి. టెస్టులలో అతని అత్యధిక స్కోరు 291 పరుగులు. వెస్టిండీస్ జట్టుకు ఎన్నో మ్యాచ్ లకు  కూడా నాయకత్వం వహించారు. 1991 లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు వివియన్  రిచర్డ్స్. 

 

 

 పరమహంస యోగానంద మరణం : భారతదేశంలో ప్రముఖ గురువు అయినా పరమహంస యోగానంద 1952 మార్చి 7వ తేదీన మరణించారు. బెంగాల్ రాష్ట్రానికి చెందిన యోగి పరమహంస యోగానంద. ఈయన రాసిన ఒక యోగి ఆత్మకథ అనే ఆధ్యాత్మిక రచన అనేక ప్రతులు  అమ్ముడుపోయి సంచలనం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: