మే 1వ తేదీన ఒకసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మీరు ఒకసారి చరిత్ర లోకి వెళ్లి ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనలు ఏమిటో తెలుసుకుందాం రండి. 

 

 కాశీనాథుని నాగేశ్వరరావు జననం : పాత్రికేయుడు వ్యాపారవేత్త స్వాతంత్ర్య సమర యోధుడు రాజకీయ నాయకుడు అయిన కాశీనాథుని నాగేశ్వరరావు 1867 మే 1వ తేదీన జన్మించారు. గ్రంథాలయాల విస్తరణకు ఎంతగానో కృషి చేసిన విద్యా వేత్త కాశీనాధుని నాగేశ్వరరావు. ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించాడు ఈయన. ఈయనను  దేశోద్ధారక విశ్వదాత అని గౌరవించేవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. 

 

 పుచ్చలపల్లి సుందరయ్య జననం : ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముందుండి నడిపించిన వీరుడు స్వతంత్ర సమరయోధులు అయినా పుచ్చలపల్లి సుందరయ్య 1913 మే 1 వ తేదీన జన్మించారు. కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన పుచ్చలపల్లి సుందరయ్య తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు. కుల వ్యవస్థను వ్యతిరేకించిన పుచ్చలపల్లి సుందరయ్య రెడ్డి తన పేరులోనే చివర రెడ్డి అనే కుల  సూచికలు తొలగించుకున్నారు. జీవితం మొత్తం ఎంతో నిరాడంబరత తో ఆదర్శ జీవితం గడిపాడు. స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా అనేక పోరాటాలలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు పోరాటంలో కూడా ముందుండి నడిపించారు పుచ్చలపల్లి సుందరయ్య. 

 

 అజిత్ కుమార్ జననం : ప్రముఖ దక్షిణాది నటుడు అయిన అజిత్ కుమార్ 1971 మే 1 వ తేదీన జన్మించారు. తెలంగాణలోని సికింద్రాబాద్ లో జన్మించిన ఈయన తన జీవితాన్ని తెలుగు చిత్రమైన ప్రేమ పుస్తకం తో ప్రారంభించారు. ప్రముఖ నటి షాలిని 2000లో పెళ్లి చేసుకున్నారు అజిత్. అజిత్ చదువుకున్నది కేవలం పదవ తరగతి వరకు అయినప్పటికీ తెలుగు తమిళ కన్నడ మలయాళ ఆంగ్ల భాషలను అనర్గళంగా మాట్లాడగలడు. నాలుగు పదుల వయస్సు దాటిన జుట్టు మొత్తం తెల్లబడిన ఏమాత్రం రంగు వేసుకోకుండా అలాగే హీరో పాత్రలు పోషిస్తూ అభిమానులను అలరిస్తున్నారు అజిత్ కుమార్. తెల్ల జుట్టు తో సినిమాలు చేస్తున్నప్పటికీ అజిత్ కుమార్ కి మాత్రం ఆదరణ అదే స్థాయిలో ఉంటుంది. అజిత్ తన నటనకు గాను ఎన్నో సార్లు ఫిలింఫేర్ అవార్డులను సైతం గెలుచుకున్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. 

 

 సుమన్ శెట్టి జననం : ప్రముఖ తెలుగు హాస్యనటుడు అయిన సుమన్శెట్టి 1981 మే 1వ తేదీన జన్మించారు. తెలుగు తమిళ భాషలలో కలిపి దాదాపుగా 70 పైగా సినిమాల్లో నటించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో జన్మించిన సుమన్ శెట్టి సినిమాలో ఎన్నో ఏళ్ల పాటు తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించాడు. తనదైన కామెడీతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు సుమన్ శెట్టి

 

 నిర్మలా దేశ్పాండే మరణం : ప్రముఖ గాంధేయవాది అయిన నిర్మలా దేశ్ పాండే  భారతదేశంలోని ప్రముఖ సామాజిక కార్యకర్త రాజ్యసభ సభ్యురాలు. మహారాష్ట్ర లో జన్మించిన ఈమె ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నారు . ఈమె  2008 మే 1వ తేదీన మరణించారు. 

 

 మే దినోత్సవం: ప్రతి సంవత్సరం కార్మికుల దినోత్సవం మే 1వ తేదీని జరుపుకుంటారు. అయితే మే 1 వ తేదీన  లేబర్ డే గా 66 దేశాలలో జరుపుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: