జూలై 3వ తేదీన ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరొక సారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు సంభవించిన మరణాలు జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటో తెలుసుకుందాం రండి. 


 ఎస్వీ రంగారావు జననం  : ప్రముఖ సినీ నటుడు దర్శకుడు రచయిత అయినా ఎస్.వి.రంగారావు 1918 జూలై 3 వ తేదీన జన్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఎంతగానో పెంచిన గొప్ప నటుడు ఎస్వీ రంగారావు, విద్యార్థి దశ నుంచే నాటకాల మీద ఎంతో ఆసక్తి కరబర్చారు... ఉద్యోగానికి రాజీనామా చేసి  నటన వైపు నడిచారు. 1946 లో వచ్చిన వరూధిని  అనే చిత్రంతో నటుడిగా పలు చిత్రాల్లో నటించారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు తమిళ కన్నడ మళయాళ హిందీ భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించారు ఎస్వీరంగారావు, రావణుడు హిరణ్యకశిపుడు ఘటోత్కచుడు కంసుడు కీచకుడు నరకాసురుడు ప్రతినాయక పాత్ర తో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికి సాధ్యం కాని ఖ్యాతి సంపాదించారు.  అంతేకాకుండా అనేక సహాయ పాత్రలో తనదైన ముద్ర వేసుకున్నారు ఎస్వీ రంగారావు. ఎస్పి రంగారావు నటించిన పాత్రల్లో  పాతాళభైరవి మాయాబజార్ నర్తనశాల సినిమా లోని పాటలు మైలురాళ్లుగా నిలిచిపోయాయి అనడంలో  అతిశయోక్తి లేదు. ఈయన  1974 మద్రాసులో గుండెపోటుతో మరణించారు. 

 

 బలివాడ కాంతారావు జననం  : సుప్రసిద్ధ తెలుగు నవల రచయిత అయిన  బలివాడ కాంతారావు 1927 జూలై 3వ తేదీన జన్మించారు, ఈయన భారత సైన్యంలో వివిధ కేడర్ లో  పనిచేశారు, దాదాపు ముప్పై ఎనిమిది నవలలు 400 దాకా కథలు నాటికలు తెలుగు నాటికలు రచించాడు. బలివాడ కాంతారావు కథలు అన్నీ ఎంతో ఆత్మీయంగా పాఠకులను స్వాగతిస్తూ ఉంటాయి.

 

 హర్భజన్ సింగ్ జననం : భారత క్రికెట్ క్రీడాకారుడు అయినా హర్భజన్ సింగ్ 1980 జూలై 3వ తేదీన జన్మించారు, భారత జట్టులో లెగ్ స్పిన్నర్ గా జట్టుకు ఎన్నో ఏళ్ల పాటు సేవలందించి అద్భుతంగా రాణించాడు హర్భజన్ , 1998లో టెస్ట్ వన్డే క్రికెట్లో భారత జట్టులో స్థానం సంపాదించాడు. మొదట్లో క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్న హర్భజన్ సింగ్ ఆ తర్వాత 2001 అనిల్ కుంబ్లే  గాయపడటంతో  జట్టులో మళ్లీ స్థానం సంపాదించుకున్నాడు. గవాస్కర్ బోర్డర్ ట్రోఫీ జట్టులో ప్రముఖ బౌలర్  గా అవతరించి ముప్పై రెండు వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు బజ్జీ . అంతేకాకుండా టెస్ట్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్ కూడా రికార్డులు కొల్లగొట్టాడు. అయితే కేవలం బౌలింగ్తో మాయ చేయడమే కాదు అవసరమైనప్పుడల్లా బ్యాట్ తో కూడా మెరుపులు మెరిపించారు హర్భజన్.

 

 రావిచెట్టు రంగారావు మరణం : తెలంగాణ విద్యా వ్యాప్తికి విశేష కృషి చేసిన ప్రముఖులు అయిన  రావిచెట్టు రంగారావు 1974 జూలై 3వ తేదీన పరమపదించారు. నల్గొండ జిల్లాలో జన్మించిన రావిచెట్టు రంగారావు... తెలుగుతో పాటు హిందీ మరాఠీ ఇంగ్లిష్ సంస్కృతం భాషలపై నేర్చుకున్నారు, తెలుగు భాష అంటే అమితమైన అభిమానం కలిగి ఉండేవారు రావిచెట్టు రంగారావు, 

 

చకిలం  శ్రీనివాస రావు మరణం : భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత అయిన చకిలం  శ్రీనివాసరావు 1996 జూలై 3వ తేదీన మరణించారు. 13 వ లోక్ సభ సభ్యులుగా పనిచేశారు ఈయన, అంతేకాకుండా రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కూడా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవుల్లో కూడా కొనసాగారు చకిలం శ్రీనివాసరావు,

మరింత సమాచారం తెలుసుకోండి: