శ్రీపాద పినాకపాణి జననం : శాస్త్రీయ సంగీత విద్వాంసులు వైద్య రంగంలో నిష్ణాతుడైన శ్రీపాద పినాకపాణి 1913 ఆగస్టు 3వ తేదీన జన్మించారు. రోగాలను రాగాలను సరిచేసి... పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు శ్రీపాద పినాకపాణి, వైద్య సంగీత రంగాలలో నిష్ణాతులైన పలువురు ఈయన శిష్యులు కావడం గమనార్హం. శాస్త్రీయ సంగీతంలో గురువులకే గురువు శ్రీపాద పినాకపాణి అని చెబుతూ ఉంటారు. తెలుగునాట శాస్త్రీయ సంగీతం అంతంతమాత్రంగా ఉన్న రోజుల్లో... పద్యాలలో హరికథలో తప్ప శాస్త్రీయ సంగీతం వినపడని రోజుల్లో.., సంగీతాన్ని తెలుగునాట పరిమళింప చేశారు శ్రీపాద పినాకపాణి. అంతే కాకుండా ఎందరో సంగీత శిఖామణులను తెలుగు వారికి అందజేశారు.
వాణిశ్రీ జననం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి వాణిశ్రీ 1948 ఆగస్టు 3వ తేదీన జన్మించారు. ప్రేక్షకులందరికీ వాణిశ్రీ గా దగ్గరైన ఈమె అసలు పేరు రత్నకుమారి. సినిమా రంగంలోకి ప్రవేశించిన తర్వాత వాణిశ్రీ గా పేరు మార్చుకున్నారు. తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ కన్నడ మలయాళ సినిమాల్లో కూడా నటించి ఎంతో గుర్తింపు సంపాదించారు వాణిశ్రీ. మరపురాని కథ అనే సినిమా ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసిన వాణిశ్రీ... తర్వాత వరుస సినిమా అవకాశాలు అందుకుని ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. శ్రీదేవి జయప్రద లాంటి తారలు తెర మీదికి వచ్చే సమయానికి వాణిశ్రీ తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర తారగా కొనసాగుతున్నారు. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన వాణిశ్రీ ప్రస్తుతం.. ధారావాహికలలో నటిస్తోంది. సీరియల్ లో కూడా ఎంతగానో గుర్తింపు సంపాదించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది వాణిశ్రీ.
మీనా కుమారి జననం : ప్రముఖ న్యాయవాది మేఘాలయ రాష్ట్రానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి అయిన మీనాకుమారి 1956 ఆగస్టు 3వ తేదీన జన్మించారు. విశాఖపట్నానికి చెందిన టీ మీనా కుమారి.. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1990 నుంచి 94 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాదిగా కూడా బాధ్యతలు నిర్వహించారు, 1998 తర్వాత మద్రాసు హైకోర్టు కు బదిలీపై వెళ్లారు మీనాకుమారి. 2013 మార్చి 23న కొత్తగా ఏర్పాటు చేయబడిన మేఘాలయ రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసారు మీనా కుమార్.
ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి మరణం : మాజీమంత్రి రాజకీయ కురువృద్ధుడు అయిన ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి 2013 ఆగస్టు 3వ తేదీన పరమపదించారు. హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన తొలి తరం కాంగ్రెస్ నాయకులలో ఒకరు ఈయన. చిన్న నాటి నుంచి రాజకీయాలపై ఎంతో ఆసక్తి కనబరిచి ఎంతో చురుగ్గా రాజకీయాల్లో పాల్గొని మంచి నేతగా గుర్తింపు పొందారు. సర్పంచ్ పదవి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి రెండు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఏపీఐసీసీ చైర్మన్ గా, తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి చైర్మన్ గా పలు పదవులు అలంకరించారు పురుషోత్తం రెడ్డి.
జీడిపల్లి విట్టల్ రెడ్డి మరణం : స్వాతంత్ర సమరయోధుడు కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం తొలి శాసనసభ్యుడు అయిన జీడిపల్లి విట్టల్ రెడ్డి... 2017 ఆగస్టు 3వ తేదీన పరమపదించారు. ప్రచార ఆర్బాటాలు లేని మచ్చలేని రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారు ఈయన. ఆయన జీవితం తొలి తరం నేతలకు ప్రతీకగా నిలిచింది, రాజకీయాలంటే నిస్వార్థంగా ప్రజా సేవ చేయడమే అంటూ నమ్మిన విట్టల్ రెడ్డి ఒకానొక సమయంలో తాను ఎంచుకున్న సిద్ధాంతాల కోసం రాజకీయాలను సైతం వదులుకున్న నిజాయితీపరుడుగా నిలిచిపోయారు.
Powered by Froala Editor
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి