చరిత్ర చాలా విలువైనది. ఇక చరిత్రలో ప్రతి రోజుకి కూడా ఓ ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి చరిత్రలో జరిగిన పలు ముఖ్య సంఘటనలు, ప్రముఖుల జాననాలు, అలాగే ప్రముఖుల మరణాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. చరిత్రలో  ఈ నాడు జరిగిన జననాల విషయానికి వస్తే..

1912 వ సంవత్సరంలో బ్రహ్మ ప్రకాష్ జన్మించారు. ఈయన మెటలర్జిస్టు.అలాగే పద్మభూషణ్ పురస్కార గ్రహీత.

1914 వ సంవత్సరంలో పి.ఆదినారాయణరావు జన్మించారు. ఈయన తెలుగు సినిమా సంగీత దర్శకులు ఇంకా నిర్మాత.

1918 వ సంవత్సరంలో సంధ్యావందనం శ్రీనివాసరావు జన్మించారు. ఈయన దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు.

1921 వ సంవత్సరంలో భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి జన్మించారు. ఈయన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు ఇంకా నిజాం విమోచనోద్యమకారుడు.

1940 వ సంవత్సరంలో లక్ష్మా గౌడ్ జన్మించారు. ఈయన గొప్ప చిత్రకారుడు.

1952 వ సంవత్సరంలో గౌతమ్ రాధాకృష్ణ దేసిరాజు జన్మించారు. ఈయన క్రిస్టల్ ఇంజనీర్.

1957 వ సంవత్సరంలో రేకందార్ ప్రేమలత జన్మించారు. ఈమె రంగస్థల నటీమణి.

1949 వ సంవత్సరంలో అహ్మద్ పటేల్ జన్మించారు. ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అగ్ర నాయకుడు.

1946 వ సంవత్సరంలో ఆలె నరేంద్ర జన్మించారు. ఈయన రాజకీయనాయకుడు.

1978 వ సంవత్సరంలో భూమిక చావ్లా జన్మించింది. ఈమె తెలుగు సినీనటి.

1986 వ సంవత్సరంలో జమైకా దేశానికి చెందిన పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ జన్మించాడు.

చరిత్రలో ఈ రోజు జరిగిన మరణాల విషయానికి వస్తే..

1978 వ సంవత్సరంలో వినూమన్కడ్ మరణించారు. ఈయన భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

2013 వ సంవత్సరంలో మాలతీ చందూర్ మరణించారు. ఈమె రచయిత్రి ఇంకా కాలమిస్టు అలాగే సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత.

చరిత్రలో ఈ రోజుని జాతీయ వృద్ధుల దినోత్సవంగా జరుపుకుంటారు.

చరిత్రలో ఈ ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల విషయానికి వస్తే..

1992 వ సంవత్సరంలో కె.ఆర్.నారాయణన్ జన్మించారు. ఈయన భారత ఉప రాష్ట్రపతి గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: