నేటి సమాజంలో ఆహారపు అలవాట్లలో చాల మార్పులు వచ్చాయి. దేశంలో షుగర్ పేషేంట్ల సంఖ్యా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇక మూడు పదుల వయసు దాటినా వారి నుండి పండు ముసలి వయసు వారిని కూడా వదలడం లేదు ఈ మహమ్మారి షుగర్. గతంలో పుట్టిన బిడ్డ కూడా ఈ వ్యాధితోనే పుట్టిన వార్తలు మనం విన్నాం. ఈ వ్యాధి ఇప్పుడు పదేళ్ల లోపు పిల్లలకు కూడా వస్తుందనడంలో సందేహం లేదు. ఈ లక్షణాలు మీ పిల్లలలో ఉంటె వెంటనే వైద్యున్ని సంప్రదించండి.

అయితే ముందుగా మధుమేహాన్ని ఆంగ్లంలో డయాబెటిస్ అంటారు. మీ పిల్లలకి డయాబెటిస్ ఉంటే, వారు మాటిమాటికి దప్పికకొంటారు. ఈవ్యాధి మొదటి లక్షణం ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి శరీర కణజాలాల నుండి నీటిని భారీగా గ్రహిస్తుంది. దీంతో పిల్లలు తీపి పానీయాల కోసం ఎక్కువగా కోరుకుంటారు. అధిక దాహం కారణంగా ఎక్కువ నీరు త్రాగటం వల్ల, మీ బిడ్డకు తరచుగా మూత్రవిసర్జన మరియు విరేచనాలు అవుతాయి. తీసుకున్న నీరు బయటకి పోకుండా ఉంటె అది ఆరోగ్యానికి హానికరం. ఇలాంటి స్థితిని గమనిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. ఇది అధిక చక్కెర స్థాయికి సంకేతం అయ్యే అవకాశం ఉంది.

ఇక కొంతమంది పిల్లలు ఎంత తిన్న మళ్ళీ ఆకలేస్తుంది అంటారు. అంతే కాదు బాగా నీరసంగా కూడా ఉంటారు. ఇది కూడా ఒక రకంగా షుగర్ వ్యాధి వచ్చే అవకాశానికి సంకేతం. దీనికి ప్రధాన కారణం శరీరంలోని కండరాలకు కావలసిన గ్లూకోజ్ తీసుకున్న ఆహరం నుండి పొందాలి. చక్కెరను శక్తిగా మార్చడానికి శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయాలి, లేదంటే శరీరంలో లోపం ఉన్నట్టే. దీనివల్ల తీసుకున్న ఆహరం శరీరానికి ఉపయోగపడకపోవడం, పిల్లలు నిరసించి మళ్ళీ ఆకలేస్తుందని అని అంటారు. దీంతో పిల్లలలో ఉన్నట్టుండి బరువు పెరగడం లేదా తగ్గడం లాంటి మార్పులు సంభవిస్తాయి. ఈ లక్షణం కనుక గమనిస్తే తప్పకుండ వైద్య చికిత్స తప్పనిసరి.

మరింత సమాచారం తెలుసుకోండి: