తల్లిదండ్రులకు ప్రతి రోజూ ఆందోళనే. చాలా ప్రశ్నలు వేధిస్తుంటాయి.  డాక్టర్లు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, పుస్తకాలు, ఇంటర్నెట్... కొన్నిసార్లు అపరిచితుల నుంచి కూడా ఎన్నో సలహాలు వస్తుంటాయి. ఒకదానికొకటి పొంతన ఉండదు. దేనిని నమ్మాలో తెలియదు. ఏం చేయాలో అర్థంకాదు.

 

అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో అర్థశాస్త్రం విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఎమిలీ ఓస్టర్ కూడా.. గర్భవతిగా ఉన్నపుడు తనకు ఎదురైన పరస్పర విరుద్ధ సలహాలతో గందరగోళానికి గురయ్యారు. అయితే, గణాంకాల విశ్లేషణలో తనకున్న శిక్షణను, అనుభవాన్ని ఉపయోగించుకుంటూ వైద్య రచనలను స్వయంగా సమీక్షించి తనే ఒక పుస్తకం రాశారు. గర్భవతిగా ఉన్నపుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది వివరిస్తూ 'ఎక్స్‌పెక్టింగ్ బెటర్' అనే శీర్షికని ప‌రిచ‌యం చేశారు.

 

'తల్లిపాలు తాగించటం వల్ల చిన్నారి ఆరోగ్యానికి స్వల్పకాలికంగా కొన్ని నిర్దిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయనే విషయాన్ని సమర్థించే సమాచారం ఉంది. కొన్ని ఎలర్జీ ర్యాషెస్, పేగుల్లో సమస్యలు, చెవుల్లో ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యలకు తల్లిపాలు పరిష్కారమవుతాయి. కానీ.. తల్లిపాలతో పిల్లలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయనే అంశాన్ని బలపరిచే సమాచారం లేదు. తల్లిపాలు తాగిన పిల్లల్లో ఎక్కువ తెలివితేటలు ఉంటాయని, ఊబకాయం, క్యాన్సర్, డయాబెటిస్ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఏ అధ్యయనమూ చెప్పటం లేదు. అయితే, పిల్లలకు చనుబాలు తాగించటం వల్ల తల్లికి కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందనేది వాస్తవం. ''మద్యం సేవించినపుడు.. చనుబాలలో ఉండే ఆల్కహాల్ స్థాయి.. మన రక్తంలో సాధారణంగా ఉండే ఆల్కహాల్ స్థాయిలోనే ఉంటుంది'' అని ఆమె చెబుతున్నారు.

 

''చిన్నారి పాలు తాగుతుంది కానీ నేరుగా మద్యం తాగదు. కాబట్టి.. వారి కడుపులోకి వెళ్లే ఆల్కహాల్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. అతిగా మద్యం తాగటం వాంఛనీయం కాదు. కానీ ఒక గ్లాసు వైన్ లేదా బీరు తాగిన తర్వాత చనుబాలు పిల్లలకు తాపకుండా పిండి పారబోయాల్సిన అవసరం లేదు'' అని చెప్పారు. అలాగే.. పిల్లలకు అసలు ఆల్కహాల్ పొడే తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే.. ఒక గ్లాసు మద్యం తాగిన రెండు గంటల వరకూ పిల్లలకు చనుబాలు ఇవ్వకుండా ఉండొచ్చని.. ఈలోగా మద్యం జీర్ణమైపోతుందని ఆమె చెప్పారు. అంత‌క‌న్నా ఎక్కువ సేవిస్తే ఇంకా ఎక్కువ స‌మయం పిల్ల‌ల‌కు పాలు ఇవ్వ‌కుండా వేచి వుండాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: