పిల్లల చదువు విషయం మాట్లాడేటప్పుడు చాలా మంది పేరెంట్స్ నుండి ఒక కామెంట్ వింటు ఉంటాము అదే మా వాడు అన్నిటిలోనూ బాగానే ఉన్నాడు ఒక్క మ్యాథ్స్ లోనే సరిగా మార్కులు రావడం లేదు అని.పేరెంట్స్ టీచర్ మీటింగ్ కి వెళ్లినప్పుడు కూడా టీచర్ చెప్పేది ఇదే కంప్లైంట్.పిల్లలు మాథ్స్ అంటే చాలు అసలు ఇంట్రెస్ట్ చూపరు.  దానికి కారణాలు ఏంటి చూద్దాం...పిల్లలందరి లోనూ తెలివితేటలు ఒకేవిధంగా ఉండవు. ఇక్కడ తెలివి తేటలు అంటే ఏ విషయాన్ని ఐనా మన మెదడు రిసీవ్ చేసుకొనే కెపాసిటీ ని బట్టి ఉంటుంది  , ఇది కొంత మందిలో ఎక్కువగా మరికొంతమందిలో తక్కువగా ఉంటుంది.

 

ఐతే మ్యాథ్స్ సబ్జెక్టు అంతా లాజికల్ థింకింగ్ తో ఉంటుంది.  ఉదాహరణకు టు ప్లస్ త్రీ ఈస్ ఫైవ్ అని చెప్తే ఇది పిల్లల కంటికి ఏమి కనిపించదు కేవలం వారు మనస్సు లో టు, త్రీ ,కలపడం లాంటి బావనాలు మైండ్ కి చేరి అప్పుడు ఆన్సర్ చెప్ప గలుగుతారు, కానీ అదే మొక్కలు రోజూ ఎదుగుతాయి ఇవి ఒకచోట నుండి మరియొక చొటకి కదలవు అని చెప్తే అది వెంటనే వాళ్ళ మైండ్ రిసీవ్ చసుకుంటాది. ఎందుకంటే కంటికి కనిపించే దృశ్యం. ఇదే మ్యాథ్స్ కి వేరే సబ్జెక్టు కి ఉన్న తేడా.ఏ క్లాస్ కి సంబంధించిన బేసిక్ విషయాలు ఆ క్లాస్ లో పెర్ఫేక్ట్ గా రాక పోతే తరువాత క్లాస్ లో దానికి సంబంధించిన భాగాలు అర్ధం కాక వాటిమీద ఇంట్రెస్ట్ తగ్గి మార్కులు తగ్గిపోతాయి. ఇది అతి పెద్ద రీజన్.

 

ఇలా ఎందుకుఅర్ధం కావట్లేదు దానికిచాలా కారణాలుఉన్నాయి. టీచర్ చెప్పే విధానం, మైండ్ రిసీవ్ చేసుకొనే పవర్ లాంటివి. ఇప్పుడు చాలా స్కూల్ లో ఆక్టివిటీ బేస్ లెర్నింగ్ ఉంది . ఇదికొంత వరుకు బాగానే ఉంటుంది కానీ ఏ ఆక్టివిటీ ఐనా క్లాస్ లో అధికం గా పిల్లలు ఉంటే , అందరికీ దానిని చేసి రిసీవ్ చేసుకొనే అవకాశం మాత్రం ఉండదు..పిల్లలు చిన్న వయస్సు లో తిరిగి అడగడానికి భయపడతారు . అర్ధం కానీ విషయాలు వారి మనస్సులో అలాగే ఉండిపోతాయి.ఐతే కొంతమంది పిల్లలు మ్యాథ్స్ చాలా బాగా చేస్తారు కానీ థియరీ సబ్జెక్టు లు అంతగా చదవరు దీనికి కారణం వీరి కి అధికంగా లాజికల్ థింకింగ్ ఉండడమే. ఇట్లాంటి వాళ్ళు ఎవరి సహాయం లేక పోయిన గాని చేయగలుగుతారు . మ్యాథ్స్ లో తక్కువ మార్కులు వస్తే నీకు మ్యాథ్స్ రాదు అంటూ నిరుత్సాహ పరచకుండా దానికి కారణాలు కనుక్కోవాలి.పేరెంట్స్ కొంచెం ఓపిక కావాలి.

 

ఏ క్లాస్ ఐనా సరే వాళ్ళ టెక్స్ట్ బుక్ తీసుకొని చాప్టర్ లో ఉన్న సబ్ టాపిక్స్ లో ఐదైదు చిన్న లెక్కలు  ఇచ్చి చేయమనాలి, ఒకవేళ చేయలేకపోతే , అవి ఒకచోట కలెక్ట్ చేసి పెట్టుకోవాలి.  అదే డేటా వాళ్ళ టీచర్ కి కూడా ఇచ్చి ఆ చాప్టర్ లో ముఖ్యమైన బేసిక్ మరొక సారి చెప్పమని అడగండి. దీని. వలన ఒకవేల పిల్లలుటీచర్ ని అడగక పోయిన వారిఏమి అర్ధం కాలేదో టీచర్ల కు తెలుస్తుంది.ఒకవేల పిల్లలు టూషన్ కి వెళ్ళితే ఇదే పని వాళ్ళ టూషన్ టీచర్ ని కూడా చేయమని చెప్పవచ్చు. ఏదేమైనా పిల్లలు మ్యాథ్స్ లోబాగా రాణించాలంటే తల్లిదండ్రులు మరియు టీచర్ ఇద్దరి సహకారం తప్పక కావాలి. .

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: