ఉరుకుల పరుగుల ఒడిదుడుకుల జీవితంలో ఎప్పుడు తింటున్నామో ఏ సమయానికి నిద్రపోతున్నామో ఎవరికీ కూడా అంత చిక్కడం లేదు. అందుకే ఈ మధ్యకాలంలో లేట్ నైట్ డిన్నర్ , అర్ధరాత్రి వేళ టిఫిన్లు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ముఖ్యంగా లాంటి అలవాటు మీ ఆరోగ్యాన్ని మరింత క్షీణింప చేస్తాయని గుర్తించుకోవాలి. ఇలా అర్ధరాత్రి పూట్ల స్నాక్స్ , భోజనం లాంటివి చేయడం వల్ల ఉబకాయం, ఒబేసిటీ వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. హార్వర్డ్ మెడికల్ స్కూల్ కి చెందిన కొంతమంది నిపుణులు తాజాగా రాత్రిపూట అధికంగా భోజనం చేసే వారిపై ఒక అధ్యయనం చేశారు. రాత్రిళ్ళు అధికంగా తినడం వల్లే బరువు పెరగడం, ఊబకాయం రావడం లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని గుర్తించారు. ముఖ్యంగా రాత్రి పూట అధికంగా తినడం వల్లే బరువు పెరుగుతారు అనే విషయాన్ని కూడా వారు నిరూపించడం జరిగింది.

మనం ప్రతిరోజు పాటించే దిన చర్య సక్రమంగా ఉంటే స్లీప్ వేక్ సైకిల్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అయితే ఒకవేళ మన దినచర్యలో ఏవైనా మార్పులు జరిగితే మాత్రం ఈ సైకిల్ కి భంగం కలుగుతుంది. అప్పుడు లేనిపోని అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా మన శరీరానికి ఎక్కువ క్యాలరీలు అర్ధరాత్రి పూట భోజనం చేయడం వల్లే లభిస్తాయి. చాలామంది రాత్రులు ఆకలి వేస్తోందని.. ఏదో ఒకటి తింటూ ఉంటారు. అలా చేయడం వల్ల తిన్న ఆహారం జీర్ణం అవ్వక .. బరువు పెరుగుతారు. అంతేకాదు రాత్రిపూట వర్కులో బిజీగా ఉండి స్నాక్స్ , ఫాస్ట్ ఫుడ్ వంటివి తింటూ ఉంటారు.  ఇలాంటివి రాత్రి సమయంలో అసలు తినకూడదు. మసాలాలతో నిండిన ఆహార పదార్థాలు తినడం వల్ల తొందరగా జీర్ణం కాక నిద్రకు ఆటంకం కలగడమే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా తలుపుతాయి.

ఇక రాత్రులు జీర్ణక్రియ వేగవంతం తగ్గుతుంది. ఈ సమయంలో అధికంగా తింటే కడుపులో నొప్పి, గ్యాస్, చాతిలో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఊబకాయం వచ్చే సమస్య ఉంది . అందుకే రాత్రిళ్ళు సమయంలో అధిక భోజనం,  ఫాస్ట్ ఫుడ్ , స్నాక్స్ వంటివి దూరంగా ఉంచండి.

మరింత సమాచారం తెలుసుకోండి: