
ఆయుర్వేద మందుకు కావాల్సిన పదార్థాలు..
100 grms ఉత్తరేణి ఆకు,100grms మిరియాలు,10రిబ్బలు వెల్లుల్లి,50grms బెల్లం తీసుకోవాలి.
తయారీ విధానం..
పల్లెల్లో ఎక్కడైనా ఉత్తరేణి ఆకు సులభంగా లభిస్తుంది. ఉత్తరేణి ఆకులు తీసుకుని, బాగా శుభ్రం చేసి, అందులో మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు,బెల్లం వేసి బాగా దంచి మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. దీనిని చిన్న చిన్న గోలీలుగా చుట్టి భద్రపరచుకోవాలి. ఈ మందును చిన్న పిల్లలకైతే చిన్న గుండి సైజంత చుట్టి,పొద్దునా, సాయంత్రం ఇవ్వాలి. ఇలా చేయడంతో చిటికెలో వైరల్ జ్వరాలు తగ్గిపోతాయి.
ఉత్తరేణి వల్ల ఇతర ప్రయోజనాలు..
ఉత్తరేణిని ఒక ఔషధం గనిగా చెప్పవచ్చు. పిప్పిపన్నుతో బాధపడేవారు ఉత్తరేణి ఆకుల నుండి రసం తీసి, అందులో దూది ముంచి పిప్పి పన్నుపై పెట్టడం వల్ల, పంటికి హాని కలిగించే బ్యాక్టీరియా మొత్తం నాశనం అవుతుంది.విరేచనాలతో బాధపడేవారికి, ఈ మొక్కను బాగా ఎండబెట్టి, పొడి చేసి, ఉదయం, సాయంత్రం మజ్జిగలో కలిపి తాగితే, విరేచనాలు తగ్గుముఖం పడతాయి. గర్భిణీలలో అధిక బీపీ వల్ల కాళ్లవాపులు వస్తుంటాయి.అలాంటి గర్భిణీలకు ఉత్తరేణి ఆకుల పొడిని తీసుకుని, ఒక గ్లాసు నీళ్లలో వేసి, తేనే కలిపి ఇవ్వడం వల్ల కాళ్ల వాపులు తొందరగా తగ్గిపోతాయి. అధిక బరువుతో బాధపడేవారు ఉత్తరేణి ఆకుల పొడి తీసుకుని, గ్లాస్ గోరువెచ్చని నీటిలో, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి పరగడుపున తీసుకోవడం వల్ల అధిక బరువును ఈజీగా తగ్గించుకోవచ్చు.