జింబాబ్వే ప్రభుత్వం గున్న ఏనుగులు అమ్మాలి అని నిర్ణయించింది.ఈ అమ్మకంపై జంతు సంరక్షణ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.కానీ, ఇప్పటికే కరవు కారణంగా 55 ఏనుగులు మరణించాయని, ఇతర జంతువులను కాపాడాలంటే నిధులు కావాలని, అందుకే ఇలా చేశామని జింబాబ్వే నేషనల్ పార్క్స్ సర్వీస్ చెబుతోంది.


ఈ అమ్మకం ద్వారా వచ్చిన నిధులతో హాంగీ నేషనల్ పార్క్‌లో బావులు తవ్వి, ఇతర వన్యప్రాణులను కరవు నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని జింబాబ్వే నేషనల్ పార్క్స్ ప్రతినిధి తెనాషి ఫరావో తెలిపారు. ప్రజల్లో అనవసర ఆగ్రహాన్ని సృష్టించడానికి ఆందోళనకారులు దీన్నో ఉద్వేగపూరిత అంశంగా మారుస్తున్నారని ఆయన ఆరోపించారు.


నేషనల్ పార్క్ సమీపంలో విస్తృత స్థాయిలో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాల కారణంగా ఇక్కడి నీటి వనరుల స్థాయి తీవ్రంగా ప్రభావితమైందని చిసైరా అన్నారు. ఆఫ్రికాలోని ఏనుగులను ఖండం దాటించి ఇతర దేశాలకు అమ్మడాన్ని నిషేధించే ప్రతిపాదనను ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా సదస్సు ఆగస్టులో ఆమోదించింది.జింబాబ్వేలోని హాంగీ నేషనల్ పార్క్‌లో గత రెండు నెలల్లో కనీసం 55 ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఈ ప్రాంతంలో నెలకొన్న తీవ్ర కరవు పరిస్థితులే దీనికి కారణం.


మరణించిన ఏనుగుల్లో కొన్ని నీటి గుంటలకు కేవలం 50 గజాల దూరంలో పడి ఉన్నాయి. అంటే, అవి చాలా దూరం ప్రయాణించి, అలసిపోయి, నీటిని చేరేలోపే మరణించాయి. హాంగీ పార్కులో 15000 ఏనుగులకు సరిపడే సౌకర్యాలున్నాయి. కానీ ప్రస్తుతం 50000కు పైగా ఏనుగులు ఉండటంతో పంటపొలాలపై తీవ్ర ప్రభావం చూపింది.


కేవలం వర్షాభావ పరిస్థితులొక్కటే దీనికి కారణం కాదు.. ఎక్కువ సంఖ్యలో ఉన్న ఏనుగులు కూడా ఓ ప్రధాన కారణమే. ఆహారం కోసం అవి సమీప పంటపొలాల్లోకి ప్రవేశించేవి. ఈ క్రమంలో అవి 22మంది పౌరుల మృతికి కూడా కారణమయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: