ప్రపంచ పరిశోధనారంగంపై మరొక భారతీయుడు తనదైన ముద్రవేసాడు. డీజిల్ –హైడ్రోజెన్ మిశ్రమాన్ని తయారుచేసి హైబ్రిడ్ ఎకానమీకి నాంది పలికాడు. ఆయన మన ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు కావడం మనందరికీ గర్వకారణం...ఆయన గురించి, ఆయన పరిశోధన గురించి పూర్తి వివరాలు మీకోసం....


కర్రి విశ్వనాథ్ విశాఖ జిల్లా అనకాపల్లిలో జన్మించి, హైదరాబాద్ ఉస్మానియాలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆస్ట్రేలియా  వెళ్లి పిహెచ్ డి, ఎంఏఐఎస్ టిఇడి, ఎంఏఐ ఏఎఫ్ సి, ఎంఎస్ ఏఎంఈ, ఎంఐఐ వంటి అనేక డిగ్రీలు ఆర్జించారు.  ఉస్మానియాలో చదువుతూనే ఇంజనీరింగ్ రంగంలో పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. ‘’ఇంటెలిజెంట్ కార్ ప్రోగ్రాం ‘’లో ఆయన ఆలోచనలు కొత్త ప్రక్రియలకు దారి చూపటంతో ఆయన పేరు ప్రఖ్యాతులు పొంది, అంతర్జాతీయ పరిశోధకులుగా గుర్తింపు పొందారు. ఇంధన సమస్యలు తీర్చటానికి ‘’డీజిల్ –హైడ్రోజన్ ‘’మిశ్రమం తయారు చేశారు. 


పర్యావరణాన్ని రక్షిస్తూ అత్యంత  శక్తివంతంగా పని చేసే ‘’హైబ్రిడ్ ఇంజన్ ‘’ నిర్మాణ బృంద నాయకులుగా, రూపశిల్పిగా  విఖ్యాతులయ్యారు. ఈ ఇంజన్ వలన ఇంధన వినియోగం 70శాతం తగ్గి, ఇంజన్ సామర్ధ్యం 20 శాతం పెరిగి వాడకం దారుల పాలిట కల్ప వృక్షమే అయింది .ఈ పరిశోధన ‘’హైబ్రిడ్ ఎకానమి’’కి నాంది పలికింది .
కేవలం ఒక స్పూన్ డీజిల్ ను ఉపయోగించి ఇంజన్ ను హైడ్రోజన్ తో నడిపిస్తే దాని శక్తి సామర్ధ్యం 20 శాతం పెరుగుతుందని ఆయన ప్రయోగపూర్వకంగా రుజువు  చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచేశారు. 


హైడ్రోజన్ లో డీజల్ కలపటం అనేది అంతర్జాతీయంగా నూతన విషయంగా ఖ్యాతి పొంది విశ్వనాథ విజయానికి ప్రపంచం శిరసు వంచింది. ఇది ‘’పునర్వినియోగ  ఇంధన పరిశోధన’’కు మార్గదర్శనం చేసి ‘’డాక్టర్ విశ్వనాథ్ ’’గా జగత్ ప్రసిద్ధులయ్యారు. ఆయన సృష్టి ఇంధన ‘’వర్రీ’’లను దూరం చేసింది .అంతర్జాతీయ స్థాయిలో’’ ప్రగతి చోదక చక్రంగా ‘’ హైడ్రోజన్ –డీజిల్ ‘’ఇంజన్ సృష్టికర్త   40 ఏళ్ళ వయసు మాత్రమే ఉన్న ఆంధ్ర శాస్త్రవేత్త కర్రి విశ్వనాథ్ కు దక్కటం మనకు గర్వకారణం. పర్యావరణం కాపాడటంలో, ఇంజన్ సామర్ధ్యం పెంచటంలో ఈ కృషి  అత్యంత  విలువైనది. మన దేశానికి మన రాష్ట్రానికి కీర్తికారణమైనది.


మరింత సమాచారం తెలుసుకోండి: