కోడి గుడ్డు కోరినంత ఆరోగ్యాన్ని..  పోషకాలను అందించే అతి సాధారణ ఆహార పదార్థం ఇది. శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాల్లో కోడిగుడ్డు అత్యంత ముఖ్యమైనది. కోడిగుడ్డులో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. శాచురేటెడ్‌ ఫ్యాట్లు, పాలీ అన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్లు, మోనో అన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్లు పొటాషియం, విటమిన్‌ ఎ, కాల్షియం, ఐరన్‌, విటమిన్‌ డి, విటమిన్‌ బి6, విటమిన్‌ బి 12, మెగ్నీషియం వంటి కీలక పోషకాలుంటాయి. పలు రకాల అనారోగ్య సమస్యలు గుడ్డుతో నివారించబడతాయి. కేవలం శరీరానికి మాత్రమే కాదు.. చర్మానికి, జుట్టుకు కూడా కోడిగుడ్డు అందాన్ని అందించేందుకు తోడ్పడుతుంది. 

 

అయితే కొంద‌రు వాటిని ఉడ‌క‌బెట్టి తింటే ఇంకొంద‌రు ఆమ్లెట్ వేసుకుని, ఇంకా కొంద‌రు కూర‌గా చేసుకుని తింటారు. మ‌రి ఎవ‌రు ఎలా తిన్నా ఉడ‌క‌బెట్టిన గుడ్ల విష‌యంలో మాత్రం మ‌నం ఓ విష‌యాన్ని గురించి క‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే. అస‌లు గుడ్డును స‌రిగ్గా ఎన్ని నిమిషాల పాటు ఉడికించి తింటే మంచిదో తెలుసా..? సాధార‌ణంగా కోడిగుడ్డు తెల్ల సొన ఉడికేందుకు దాదాపుగా 82 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవ‌స‌రం. అదే దాని లోప‌లున్న ప‌చ్చ సొన ఉడికేందుకు మాత్రం అంత క‌న్నా త‌క్కువ‌గా అంటే 76 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్ర‌మే అవ‌సరం అవుతుంది.

 

ఒక కోడిగుడ్డును హార్డ్ బాయిల్ చేసేందుకు క‌నీసం 13 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంద‌ట‌. అదీ ఎక్కువ మంట పెడితే 9 నిమిషాల్లోనే గుడ్డు ఉడుకుతుంది. సో.. ఇలా ఉడికించి గుడ్డును తిసుకుంటే మంచిదంటున్నారు నిపుణులు. ఎన్నో పోషకాలు నిండి ఉన్న గుడ్డును.. ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు పొంద‌వ‌చ్చు. అలాగే చిన్న పిల్లలకు ప్రతిరోజూ గుడ్డును తినిపించడం ద్వారా వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: