మనిషికి తుమ్ములు, ఆవలింతలు రావడం సహజం. ఒకరు ఆవులించగానే ఖచ్చితంగా ఆవలింత మరొకరికి వస్తుంది.. ఇదే ఆవలింతలో ఉన్న మ్యాజిక్, అయితే దీని వెనకున్న లాజిక్ ను మాత్రం మన సైంటిస్టులు ఇంకా కనుక్కోలేకపోయారు. కళ్లు మూతలు పడిపోయేలా నిద్ర వస్తుంటేనో, ఏమీ తోచకుండా నిస్సారంగా ఉంటేనో ఆవలింతలు రావడం సహజం. కానీ అవతలివారు ఆవలించినప్పుడు మనకి కూడా ఆవలింత రావడంలో ఆంతర్యం ఏమిటి..? వాస్త‌వానికి ఆవలించడం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుంది. జీవితాంతం ఉంటుంది. 11 వారాల వయసున్న గర్భస్థ శిశువు కూడా ఆవలిస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. 

 

దీన్ని బ‌ట్టి చూస్తుంటే భూమి మీద‌కు రాక ముందే ఆవ‌లింత మ‌న‌కి ద‌గ్గ‌ర‌వుతుంద‌న్న మాట‌. అంటే ఆవ‌లింతే మ‌న ఫ‌స్ట్ ఫ్రెండ్. అలాగే మనం జీవితకాలంలో సగటున 2.4 లక్షల సార్లు ఆవలిస్తాం. మ‌రో విష‌యం ఏంటంటే.. సగటున ఒక్కో ఆవలింత 6 సెకన్ల వరకూ ఉంటుంది. అయితే మనిషి జీవిత కాలంలో 400 గంటలు ఆవలించడానికి ఉపయోగిస్తార‌ట‌. మనకి బోర్ కొట్టినప్పుడు లేదా నిద్ర ముంచుకు వ‌చ్చిన‌ప్పుడు ఆవలింత వ‌స్తుంది. బుక్స్ చదివేటప్పుడు చాలా మంది ఆవలించడాన్ని గమనించే ఉంటారు. అయితే ఆవలించడం వల్ల మెదడుకి రక్త ప్రసరణ బాగా జరిగి మెద‌డు మరింత షార్ప్ గా పనిచేస్తుంది. 

 

మ‌నకు ఎక్కువ ఆవలింతలు వస్తున్నాయి అంటే నిద్ర‌కు  మాత్రమే సంకేతం కాదు.. దానర్ధం, మెద‌డు త‌న‌ని తాను యాక్టివ్ గా  ఉంచుకోవ‌డానికి  ప్రయత్నిస్తుందని. అదే విధంగా ఆవలింత ఒకరి నుంచి మరొకరికి పాకుతుంది. ఇదో రకం కమ్యూనికేషన్ కావొచ్చని కొందరు పరిశోధకులు చెబుతారు. వాస్త‌వానికి అవ‌లింత ఎందుకు వ‌స్తుంది, ఒక‌రి నుంచి ఒక‌రికి ఎలా పాస్ అవుతుంది అన్న విష‌యాల‌పై ర‌క‌ర‌కాల అధ్యాయ‌నాలు జ‌రిపారు కానీ.. ఇంతవరకూ స్పష్టమైన కారణాన్ని చెప్పలేకపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: