మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటేనే ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీని పట్టుకుని బుచ్చిబాబు సానా ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారు. ‘పెద్ది’ టైటిల్ అనౌన్స్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న ‘మూడో షేడ్’ రూమర్ మెగా ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.బుచ్చిబాబు సానా ఈ సినిమా కోసం చరణ్‌ను చూపించే విధానం చాలా భిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది.ఇప్పటికే ఈ చిత్రంలో రామ్ చరణ్ క్రికెటర్‌గా, కుస్తీ ఫైటర్‌గా కనిపిస్తారని సమాచారం. ఈ రెండు పాత్రల కోసం ఆయన కండలు పెంచి, బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చేశారట.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా కథలో ఒక మూడో వెర్షన్ కూడా ఉండబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అది ఒక అథ్లెట్‌గా ఉండొచ్చా లేక ఏదైనా స్పోర్ట్స్ కోచ్ పాత్రగా ఉంటుందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకే సినిమాలో మూడు విభిన్నమైన క్రీడా నేపథ్యాలు అంటే మెగా ఫ్యాన్స్‌కు పండగే!ఈ సినిమా కేవలం రామ్ చరణ్ సినిమా మాత్రమే కాదు, ఒక గ్లోబల్ ప్రాజెక్ట్. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండటంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ జోడీకి క్రేజ్ ఉంది.టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు, కన్నడ పవర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తుండటంతో సినిమా రేంజ్ పెరిగింది. వీరిద్దరి కాంబినేషన్లో సన్నివేశాలు థియేటర్లను షేక్ చేయడం ఖాయం.

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు ప్రాణం పోస్తున్నారు. బుచ్చిబాబు - రెహమాన్ కాంబినేషన్ అంటేనే మ్యూజికల్ మాస్టర్ పీస్ అని ఫిక్స్ అయిపోవచ్చు. ‘పెద్ది’ కోసం రెహమాన్ కంపోజ్ చేసిన ట్యూన్స్ ఆల్రెడీ సెట్స్ లో మారుమోగుతున్నాయని, చరణ్ డాన్స్ స్టెప్పులకు తగినట్టుగా అదిరిపోయే బీట్స్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల టాక్.ఈ చిత్రాన్ని వృద్ది సినిమాస్ బ్యానర్ పై ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అప్‌డేట్ రాబోతుందని, ఆ రోజున బాక్సాఫీస్ వద్ద మెగా సునామీ గ్యారెంటీ అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: