ఇక అదే ఊపుతోనే అటు హీరో నిర్మాత ఈ సినిమా సీక్వెల్ ని అత్యంత భారీ స్థాయిలో ప్లాన్ చేసినట్లు ప్రకటించారు. గతం నేర్పిన పాట భయంకరమైన భవిష్యత్తు ఆకలి పెరుగుతుంది, దురాశ కొనసాగుతోంది అనే ఒక పవర్ ఫుల్ క్యాప్షన్ తో రిలీజ్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ తోనే సినిమా పైన అంచనాలను మరింత పెంచేసినట్టు కనిపిస్తోంది. అలాగే ఈసారి మరుగున పడిన దేవుళ్ళ రహస్యాలను, హస్తర్ పురాణాలలోని కొన్ని రహస్యాలను భారీ స్థాయిలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సీక్వెల్ లో మరో బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖి ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారట. సోహం షా, నవాజుద్దీన్ ఇద్దరు మంచి యాక్టర్స్ కావడం చేత ఈ సినిమా నటన పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా కోసం ముంబైలో 8 ఎకరాలలో భారీ సెట్ వేసి మరి ఒక నగరాన్ని సృష్టించి షూటింగ్ చేస్తున్నారు. తంబాడ్ చిత్రానికి సహదర్శకత్వం వహించిన ఆదేశ్ ప్రసాద్ ఈ సినిమా సీక్వెల్ ను దర్శకత్వం వహిస్తున్నారు. మరి 2027లో ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి