తెలుగించి అమ్మాయిలు.. మిగిలిన రోజుల్లో ఎన్ని ఫ్యాషన్‌ డ్రస్సులు వేసుకున్నా సంక్రాంతి పండుగ వచ్చిందంటే.. లంగా ఓణీ వేయాల్సిందే. విరిసీవిరయని పూబంతుల అందానికి మరింత అందాన్నిచ్చేది లంగా ఓణీ మాత్రమే. చిన్నదాని సొగసుకూ పడుచుప్రాయపు హొయలకూ ఇంతకు మించిన సాంప్రదాయ వస్త్రాలంకరణ ఉంటుందా.

 

లంగాఓణీలో యావరేజ్ అమ్మాయి కూడా దివి నుంచి దిగివచ్చిన అప్సరసలా కనిపిస్తుంది. రోజురోజుకూ దూసుకొస్తున్న సరికొత్త ఫ్యాషన్లతో.. ఈ పురాతన లంగాఓణీ కాస్త వెనుకబడ్డట్టు కనిపించినా దీని అందం ఏ ఫ్యాషన్‌ కూ సాటి రాదు. పొలంలో విరిసిన ముద్దబంతిలా.. పెరటి తోటలోని మందారంలా.. అరవిరిసిన మల్లెమొగ్గలా.. అతివల అందాన్ని రెట్టింపు చేసేది ఈ లంగా ఓణీయే.

 

అయితే.. పట్టులంగా అంటే గతంలో ఒకటే రంగులో ఉండేది.. కానీ ఇప్పుడు ఫ్యాషన్ మారింది. జరీబుటీలనీ.. చారలనీ గడులనీ అద్దుకుని వింతైన రంగుల్లో చూడచక్కని ఓణీలు కనువిందు చేస్తున్నాయి. ఏనుగులూ నెమళ్లూ చిలకల డిజైన్లతో వచ్చే పోచంపల్లి పట్టు డిజైన్లూ ఈ లంగాఓణీల ఆందాలను రెట్టింపు చేస్తున్నాయి. మరి ఈ డ్రస్సుల్లో కనిపించే అమ్మాయిలను చూసి కుర్రాళ్లు గుండెలు తట్టుకోగలవా..?

మరింత సమాచారం తెలుసుకోండి: