భారతీయ సంస్కృతిలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. భారత చట్టాలు కూడా వివాహ వ్యవస్థను అపవిత్రం చేసే విధంగా ఎక్కడా ప్రవర్తించవు. ఇక కోర్ట్ లు కూడా మన సాంప్రదాయాలను ఆధారంగా చేసుకునే చాలా వరకు తీర్పులు కూడా ఇస్తూ ఉంటాయని అంటూ ఉంటారు. అయితే పెళ్ళిళ్ళ విషయంలో అసలు తల్లి తండ్రులు జాగ్రత్తలు తీసుకుంటున్నారా...? కనీస జాగ్రత్తలు పాటించే ఏడు అడుగులు తమ పిల్లలతో వేయిస్తున్నారా...? అంటే లేదనే అంటున్నారు ప్రస్తుత పరిస్థితులు గమనించిన వారు. 

 

ఒక వ్యక్తికి 35 ఏళ్ళు ఉంటే అమ్మాయికి 20 ఏళ్ళు లేదా 18 ఏళ్ళు ఉంటున్నాయి. వీళ్ళ మధ్య ఏజ్ గ్యాప్ దాదాపు 20 ఏళ్ళ వరకు ఉంది. దీనితో ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం గాని, ఒకరి ఆలోచనా విధానాన్ని మరొకరు అంగీకరించడం గాని దాదాపుగా కనపడటం లేదనే చెప్పాలి. వెనకటి ఆలోచనల ప్రకారం భర్త వెళ్తే భార్య మాత్రం ప్రస్తుత సమాజానికి అనుగుణంగా ఆలోచిస్తుంది. దానికి తోడు ఆలోచనా విధానం కూడా చాలా వరకు తేడాగా ఉంటుంది. ఇక పెద్దల ఒత్తిడి తో వివాహం చేసుకుంటున్నారు పిల్లలు. 

 

వారు చాలా వరకు భర్తలతో మానసిక, శారీరక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కన్న తల్లి తండ్రులకు చెప్పుకోలేక, పిల్లలకు చెప్పుకోలేక చాలా మంది ఆడవాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితులు ఉంటున్నాయి. రెండు మూడేళ్ళు అంటే ఇబ్బంది లేదు గాని దాదాపు 5 ఏళ్ళు దాటిన దగ్గరి నుంచి కూడా సమస్యలు చాలానే వస్తున్నాయి. అభిప్రాయాలకు విలువ లేకపోవడమే కాకుండా భావోద్వేగాలకు గాని, చిన్న చిన్న కోరికలకు ప్రాధాన్యతలు గాని ఉండటం లేదు. దీనితో విడాకుల వరకు వెళ్లి రెండో పెళ్లి చేసుకునే వరకు వెళ్తున్నారు ఆడవాళ్ళు. అందుకే తల్లి తండ్రులు ఏజ్ గ్యాప్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: