రొటీన్.. రొటీన్.. రొటీన్.. ఇది చాలా బాగా వినిపించే పదం.. ఇక సగటు ఉద్యోగస్తుల సంగతైతే చెప్పనక్కర్లేదు.. లేవడం.. రెడీ కావడం ఆఫీసుకు వెళ్లడం.. ఏ సాయంత్రమో, రాత్రికో ఇంటికి చేరుకోవడం.. మళ్లీ లేచి ఆఫీసుకు పోవడం.. ఇంతకు మంచి ఏ ఆదివారమో, సెలవో వస్తే తప్ప వారి షెడ్యూల్ లో మార్పు ఉండదు.

 

 

ఇలాంటి సమయాల్లోనే జీవితం నిస్సారంగా అనిపిస్తోంది. బోర్ డమ్ వస్తుంది. ఇది పోవాలంటే.. దీనికి బ్రేక్ వేయాల్సిందే. జీవితంలో కిక్ ఇచ్చేది మార్పు మాత్రమే. అందుకే జీవితంలో బోర్ పోవాలంటే.. మార్పులు రావాలి.. మీ షెడ్యూల్ మార్చేయండి.. నెలలో కనీసం ఒక్కసారైనా ఏదైనా కొత్త ప్రదేశాన్ని చూడటం లక్ష్యంగా పెట్టుకోండి.

 

 

అమ్మో... బడ్జెట్ అంటారా.. ఈ లెక్కలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మీ పాత స్కూలుకు ఓసారి వెళ్లిరండి.. మీరు పుట్టిన గ్రామాన్ని సందర్శించండి.. ఆప్తమిత్రులకు సమాచారం ఇవ్వకుండా హఠాత్తుగా వెళ్లి.. ఒక్కసారిగా సర్ ప్రైజ్ చేయండి.. రేపు అన్న దానికి రూపు లేదు.. గతం గతం.. ఈ క్షణమే మనది ఆస్వాదిద్దాం అన్న సిద్ధాంతాన్ని ఫాలోకండి.. ఇక మీ జీవితంలో కాస్తయినా బోర్ తగ్గుతుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: