చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. డబ్బు ఉంటే చాలు.. ఆనందం అదే వస్తుందని.. బాగా డబ్బు ఉంటే చాలా ఆనందంగా ఉంటామని.. ఈ అపోహ ఎక్కువగా పేద వారికి ఉంటుంది. ఎందుకంటే డబ్బులేక వారు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అందుకే డబ్బొస్తే చాలా ఆనందం వస్తుందనుకుంటారు.

 

 

కానీ ఇది నిజం కాదని డబ్బున్న వాళ్లతో మాట్లాడితే తెలుస్తుంది. ఎందుకంటే కోట్ల సంపద ఉన్న వాళ్లు కూడా చాలా మంది ఆనందంగా ఉండరు. మరి ఆనందం ఎలా వస్తుంది.. ఆనందం అన్నది ఓ మానసిక స్థితి. జేబులో పది రూపాయలు లేని వాడు కూడా చాలా ఆనందంగా ఉండొచ్చు.

 

 

ఎవడితోనూ పోల్చుకోకపోవడం.. ఉన్నదానితో తృప్తి పడటం.. పాజిటివ్ గా ఆలోచించగలగడం, ఏది జరిగినా మన మంచికే అనుకోవడం.. జీవితంలో ఏం జరిగినా దాన్ని స్వీకరించగలగడం .. ఈ లక్షణాలు మనిషికి ఆనందం ఇస్తాయి. ఆనంద రహస్యం తెలుసుకున్నవాడు నిత్యం నవ్వుతూ, చలాకీగా నవ్విస్తూ ఉంటాడు.

 

 

ఆనందాన్ని అపార్థం చేసుకున్నవాడే విషాదం వెంట తిరుగుతాడు. ఈ విశ్వంలో మనం సరైన సంబంధాలు కొనసాగించాలంటే ఆనందమే పరమావధిగా జీవించాలి. ఎవరు ఎంత బాగా, తొందరగా దాన్ని తమ శరీరాల్లోకి వ్యాపింపజేసుకోగలరో వాళ్లకే ఈ బతుకు ఆహ్వానం పలుకుతుంది. తిరోగామిని చేసే విషాదం మూసిన తలుపు వంటిది. దాన్ని బాదుతూ కూర్చోకూడదు. అది తెరుచుకుందా... అడుగులేని గొయ్యి లాగా జీవితం నరకప్రాయమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: