బాగా ఆలోచించి చెప్పు.. అసలు నువ్వు జీవిస్తున్నావా..? అని అంటే.. ఇదేం పిచ్చి ప్రశ్న అంటారు.. జీవించి ఉండకపోతే.. నీతో ఎలా మాట‌్లాడతాను.. కళ్ల ముందే మనిషిని పట్టుకుని జీవించి ఉన్నావా.. అంటావా.. నీకెంత పొగరు అంటారు కదా. అయినా ఎందుకు అలా అడిగావంటారు కదా.

 

 

అదీ చెబుతా.. జీవించడం అంటే.. కేవలం ప్రాణంతో ఉండటం కాదు సుమా.. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ బతకడం..  ఆ ఇలాంటి కబర్లు చాలా చెబుతారు అంటారా.. మాకు ఉద్యోగం, సజ్యోగం చాలా ఉన్నాయి. బాధ్యతలు చాలా ఉన్నాయి.. ఇలాంటి కళాపోషణ మా వల్ల కాదు అంటారా.. 

 

 

కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే.. ఏ పని అన్నది ముఖ్యం కాదు... దాన్ని ఎలా చేస్తున్నామన్నదే ప్రధానం. పేరు ప్రతిష్ఠల కోసం పాకులాడకుండా, కీర్తి శిఖరాలకై వెంపర్లాడకుండా, నిదానమే ప్రధానంగా, శ్రద్ధాభక్తితో, ఎరుకతో, ఆనందంగా, పవిత్ర మనసుతో ఏ కార్యం చేపట్టినా అది సృజనాత్మకంగా ఉంటుంది.

 

వర్తమానంలో జీవించడమంటే, తామరాకుపై నీటి బిందువులా ఉండటం. ఆ క్షణాల్లో మనసు భూత భవిష్యత్తులకు సంబంధించిన డోలాయమాన స్థితిలో ఉండదు. అనవసర ఆలోచనలు వేధించవు, పరధ్యానంలోకి మళ్లించవు. అప్పుడు చేతుల్లో ఉన్న ప్రతీ పని ఒక ప్రార్థన అవుతుంది. అదే అసలైన జీవించడం అవుతుంది. ఇప్పుడు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి..

మరింత సమాచారం తెలుసుకోండి: