మనం ఏం తింటున్నామో ఏ టైంలో తింటున్నామో అనే విషయాలు మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతాయి. ఉదయం లేవగానే కాసేపు వ్యాయామం చేసి అనంతరం బ్రేక్ ఫాస్ట్ చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఉదయం 7 గంటల లోపు బ్రేక్ఫాస్ట్ చేయడం ఆరోగ్యకరమైన అలవాటు అనే డాక్టర్లు చెప్తున్నారు. ఉదయం 10 గంటల సమయం దాటితే బ్రేక్ ఫాస్ట్ చేయడం వ్యర్థమని లండన్ డాక్టర్ అనేక సర్వేలు చేసి చెప్పారు. బ్రేక్ ఫాస్ట్ చేసిన నాలుగు గంటల అనంతరం మధ్యాహ్నం భోజనం(లంచ్) చేయాలి. లంచ్ ఎప్పుడూ మిస్ కాకుండా నాలుగు గంటల లోపే తినడానికి ట్రై చేయడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. 


ఇక రాత్రి భోజనం గురించి మాట్లాడుకుంటే... సాయంత్రం 7 గంటల లోపు తేలికపాటి భోజనాన్ని స్వీకరించాలి. పడుకునే మూడు గంటల ముందే రాత్రి భోజనం తినాలని డైటీషియన్లు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో బరువులు ఎత్తకూడదు. ప్రస్తుత డిజిటల్ కాలంలో ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితమవుతూ... శారీరక శ్రమ అస్సలు చేయడం లేదు. అందుకే కేవలం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో ఆహారం భుజించాలని లేకపోతే ఊబకాయం లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సమయం సందర్భం లేకుండా ఈ రోజుల్లో అనేక మార్లు ఆహారం తీసుకోవడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యాన్ని నిండు నూరేళ్లు కాపాడుకునేందుకు ఆహారం మితంగా స్వీకరించాలని అప్పట్లో మన పూర్వీకులు పుస్తకాల ద్వారా తెలియపరిచారు. 


సహజంగా ఏర్పడే ఆకలిని తీర్చకుండా ఉండడం వలన శరీరములో అలసట, బలం క్షీణించడం, నొప్పులు రావడం లాంటి అనేకమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారం తీసుకోవడం వలన పోషకాహార లోపం కలిగే ప్రమాదం. అందుకే తరచూ సరికొత్త ఆహార పదార్థాలు స్వీకరించడం ఆరోగ్యకరం. జీవించడానికే భుజించేవారు కలకాలం ఆరోగ్యంగా జీవిస్తే... భుజించడానికే జీవించేవారు మాత్రం అతి తక్కువ వయస్సులోనే రోగగ్రస్తులు అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: