ద్రాక్షల లో మూడు రకాలు ఉంటాయి. ఆకు పచ్చ , నలుపు, ఎరుపు.. అయితే నల్లని ద్రాక్ష పండ్లు ఎక్కువగా దొరుకుతాయి. తియ్యగా పుల్లగా ఉండే ఈ ద్రాక్ష ని ఫ్రెష్ గా తీసుకుంటే చాలా మంచిది. జ్యూస్ చేసుకుని తీసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటి వల్ల చాలా బెనిఫిట్స్ మనకి కలుగుతాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


మైగ్రేన్, డిమెన్షియా మరియు అల్జీమర్ వ్యాధిని దరిచేరకుండా ఇది జాగ్రత్త గా ఉంచుతుంది. ఇందులో యాంటీ మ్యూట జెనిక్ మరియు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ సమృద్ధిగా ఉంటాయి.

నల్ల ద్రాక్షను తీసుకోవడం వల్ల షుగర్ ని కంట్రోల్ చేయవచ్చు. అలాగే తరచుగా వీటిని తీసుకోవడం వల్ల ఏకాగ్రత తో పాటు జ్ఞాపక శక్తి కూడా మెరుగు పడుతుంది.

ఇకపోతే స్త్రీల లో  బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వివిధ రకాల కేన్సర్లను రాకుండా ఇది కాపాడుతుంది. బ్లాక్ గ్రేప్స్ ను తీసుకోవడం వల్ల మంచి కంటి చూపును కలిగి ఉండేలా సహాయ పడుతుంది.


వీటి లో విటమిన్స్ , మినరల్స్ తో పాటుగా యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.. స్కాల్ప్ కి రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా ఏర్పాటు చేస్తుంది. దీని తో జుట్టు రాలిపోయే సమస్యను కూడా తగ్గించ వచ్చు. నల్ల ద్రాక్షను తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు .. అంతే కాదు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు..


చూసారుగా నల్లని ద్రాక్ష వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో.. వీటి ధర కూడా తక్కువ గానే ఉంటుంది.. ప్రతి సీజన్ లో ఈ ద్రాక్షలు లభిస్తాయి.. సమ్మర్ సీజన్ లో మరీ ఎక్కువగా ఉంటాయి.. రోజుకు రెండు నల్లని ద్రాక్ష పండ్లను తినడం అలవాటు చేసుకోండి.. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: