అమెరికా కేంటుకిలో ఒక వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అయితే ఆయన తన కూతురుకు ప్రేయసి పేరు పెట్టాడు. తను చేసే అక్రమ సంబంధం ఇంట్లో ఎవరు తెలియకూడదని భావించి ఆ పేరు పెట్టాడని తెలుస్తోంది. అయినా అతని ప్లాన్ చేసినట్టు జరగకుండా సీన్ రివర్స్ అయింది. బిడ్డ పుట్టిన కొద్ది నెలలకే అసలు రహస్యం బయట పడింది. దీని తర్వాత అతని ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యి గందరగోళం మొదలయింది. ఎందుకంటే సదరు వ్యక్తి తన కూతురు పేరు పెట్టిన విషయాన్ని వారికి తెలిసినటువంటి మరో యువతి టిక్ టాక్ ద్వారా వెల్లడించింది. ఆమె పుట్టకముందే తల్లిదండ్రులు అబ్బాయి పుట్టినట్టు అయితే తల్లికి పేరు పెట్టే అవకాశం ఇవ్వాలని, అమ్మాయి పుట్టి నట్లయితే తండ్రి పేరు పెట్టే అవకాశం ఇవ్వాలని ఇద్దరు దంపతులు ఒప్పందం కుదుర్చుకున్నారని అమ్మాయి టిక్ టాక్ ద్వారా తెలిపింది. దీంతో వారికి అమ్మాయి జన్మించడంతో ఆమె తండ్రి అని తన కూతురుకు క్రిస్టియానా అని పేరు పెట్టాడు. దీంతో అతని భార్య కూడా పేరు చాలా బాగుందని సంబరపడిపోయింది.
వాస్తవానికి ఆ పేరు ఎందుకు పెట్టారు. తన భార్యకు అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత ఆయన చేస్తున్నటువంటి అక్రమ సంబంధం గురించి ఆమెకు తెలిసిపోయింది. ఇంట్లో అనుకోకుండా ప్రేయసి పేరును ప్రస్తావించినప్పుడు దొరికి పోకుండా ఉండేందుకు ఈ పని చేశానని తన భార్యతో చెప్పాడని సదరు యువతి టిక్టాక్ ద్వారా తెలిపింది. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో అనేకం జరుగుతుంటాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి