
ఇస్లాంను ఆచరించే గల్ప్ దేశాలు సైతం యోగాను చేయడానికి ముందుకొచ్చాయి. కానీ ఇండియాలో సెక్యూలర్ ముసుగులో ఉన్న కొంతమంది యోగా వద్దు సెక్స్ ముద్దు అనే ప్రచారం చేస్తున్నారు. దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రు యూనివర్సీటీ కి చెందిన కొంతమంది విద్యార్థులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. జేఎన్ యూలో ఉన్న కొందరు విద్యార్థులు, యోగా కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. యోగా కంటే సెక్స్ బెటర్ అని టీషర్టులు తొడుక్కుని నిరసన తెలుపుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించి దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది. జపాన్, జర్మనీ, అమెరికా, బ్రిటన్, గల్ప్ దేశాలు సైతం యోగాను ఎంతో ఇష్టంగా నేర్చుకుంటున్నారు. చాలా మంది యోగా చేయడం వల్ల తమ ఆరోగ్యాలు మెరుగుపడ్డాయని ఎంతో సాంత్వన చేకూరిందని అనుకుంటున్నారు.
యోగా మెడిసిన్లకు కూడా తగ్గని రోగాలను సైతం నయం చేయగల శక్తి ఉందని కొంతమంది చెబుతున్నారు. స్వయంగా యోగా చేయడం వల్ల కలిగిన లాభాలను ఇతరులతో పంచుకుంటున్నారు. భారత్ లోనే కాదు వివిధ దేశాల్లో యోగా ప్రాముఖ్యం తెలిశాక, దాన్ని విడిచి పెట్టేందుకు ఎవరికి మనసు ఒప్పడం లేదు. యోగాతో ఎంతో మంది ఆరోగ్యంగా జీవిస్తున్నారు. కానీ యోగాకు వ్యతిరేకంగా ఇండియాలోనే యోగా వద్దు, సెక్స్ ముద్దు అనే నినాదం తీసుకువచ్చిన జెఎన్ యూ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా పార్టీల ప్రజా ప్రతినిధులు, యోగా ప్రేమికులు కోరుతున్నారు.