సాధారణంగా,వడ,గారే చేయాలంటే కచ్చితంగా మినపగుళ్ళు,లేదా మినపప్పు ఎదో ఒకటి కచ్చితంగా ఉండాలి.బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే,ఇడ్లీ,దోస,వడ,గారే,పునుగు దేనిలోకైనా మిన్నపగుళ్ళు ముఖ్యపాత్ర వహిస్తాయి.టేస్ట్ కూడా బాగుంటుంది.కానీ ఆ మినపగుళ్ళు లేకుండా అదే టేస్ట్ తో గారెలు చేయవచ్చు అని మీకు తెలుసా.అనుకోకుండా ఇంటికి ఎవరైనా బంధువులు స్నేహితులు వస్తే నిముషాల్లో ఈ గారెలు చేసి పెట్టవచ్చు.అచ్చం మినపగుళ్ళు తో చేసినట్టే టేస్ట్ అదిరిపోతుంది.ఎలా అనుకుంటున్నారా,ఇకెందుకు లేట్ ఈ రెసిపీ ని ఫాలో అయిపోండి.ఇంట్లో రైస్ ఎనీ టైం ఉంటుంది కాబట్టి రెండు కప్పులు రైస్ తీసుకోండి.ఇందులో ఒక కప్ పెరుగు యాడ్ చేసి మరీ మెత్తగా కాకుండ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని షిఫ్ట్ చేసుకోండి.ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,సన్నగా తరిగిన నాలుగు పచ్చిమిర్చి ముక్కలు,ఒక చెంచా జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి.


ఇందులోనే ఒక గుప్పెడు సన్నగా తరిగిన కరివేపాకు,కొత్తిమీర తిరుము కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు కాడాయిలో డీఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా కాగానివ్వాలి.ఆయిల్ బాగా హీట్ అయినా తరువాత ఒక ప్లాస్టిక్ పేపర్ పైన నూనే రాసి,ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని గారెల్లా చేసుకొని,నూనెలో వదలాలి.అటు ఇటు బాగా ఎర్రగా కాలే వరకు డీఫ్రై చేసుకోవాలి.ఇలా మిగిలిన పిండిని కూడా డీఫ్రై చేసుకోవాలి.అంతే కరకరలాడే వేడి వేడి గారెలు రెడీ.ఇవి తింటుంటే అచ్చం మినపగారెలు తిన్న ఫీలింగ్ వస్తుంది.చాలా రుచిగా ఉంటాయి.మార్నింగ్ మనకు టైం లేనపుడు ఇలా చేసుకొని తినొచ్చు.ఈవెనింగ్ స్నాక్స్ లా కూడా చేసుకోవచ్చు.సమయం కూడా చాలా తక్కువ పడుతుంది.రైస్ తో పులిహోర, ఫ్రైడ్ రైస్,దద్దోజనం,బెల్లపన్నం ఇలా చేస్తూ ఉంటాము.ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తూ ఉండండి.ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తిన్నాలనిపిస్తుంది.అన్నంతో ఇలా గారెలు చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: