
అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఫ్రిడ్జ్ డోర్ తీయాలి. అవసరం లేకపోయిన ప్రతి సారి తలుపు తెరిస్తూ ఉంటే లోపల ఉష్ణోగ్రత పెరిగి, మళ్లీ కూల్ చేయటానికి ఎక్కువ ఎలక్ట్రిసిటీ ఖర్చవుతుంది. ఇది కాంప్రెసర్ పై ఒత్తిడిని పెంచుతుంది. సో.. పని లేకపోయిన తరచూ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసే అలవాటు ఉంటే మానుకోండి.
ఫ్రిడ్జ్ ను ఇరుకు ప్రదేశంలో కాకుండా గాలి తగిలే చోట సెట్ చేసుకోవాలి. గోడకు కనీసం 6 అంగుళాల దూరంలో ఉంచండి. సూర్యకాంతి పడే ప్రదేశాల్లో పెట్టొద్దు. ఫ్రిడ్జ్ పై ఎటువంటి వస్తువులు ఉంచకూడదు. ఫ్రిడ్జ్ లోపల ఎప్పుడూ కూడా 70 శాతం మాత్రమే నింపండి. మిగిలిన స్థలం గాలి సరళంగా ప్రసరించడానికి వదిలేయాలి. లేదంటే ఫ్రిడ్జ్ పై ఒత్తిడి పెరుగుతుంది.
రిఫ్రిజిరేటర్ వెనక భాగంలో కండెన్సర్ కాయిల్స్ ఉంటాయి. వీటిపై దుమ్ము పేరుకుపోతే సామర్థ్యం తగ్గుతుంది. అందువల్ల ప్రతి 6 నెలలకి ఒకసారి వీటిని శుభ్రం చేసుకుంటే ఫ్రిడ్జ్ ఎక్కువ కాలం మన్నుతుంది.
రిఫ్రిజిరేటర్ త్వరగా పాడవకుండా ఉండాలంటే స్టెబిలైజర్ లేదా సర్జ్ ప్రొటెక్షన్ తప్పక ఉపయోగించాలి. లేకుండా అకస్మాత్తుగా విద్యుత్ మార్పులు జరిగితే, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ వల్ల ఫ్రిడ్జ్ దెబ్బతినే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి.
వేడి వేడి పదార్థాలను ఫ్రిడ్జ్ లో పెట్టవద్దు. అలా చేస్తే లోపల ఉష్ణోగ్రత పెరిగి కూలింగ్ దెబ్బతింటుంది. అలాగే ఫ్రిడ్జ్‌లో పేరుకుపోయిన ఐస్‌ను తొలగించేందుకు వారం లేదా పది రోజులకు ఒకసారి డిఫ్రాస్ట్ బటన్ నొక్కండి. లేదంటే ఐస్ ఎక్కువైపోయి ఫ్రిజ్ పనితీరు తగ్గుతుంది.
రిఫ్రిజిరేటర్లు ఎక్కువ కాలం మన్నాలంటే సరైన ఉష్ణోగ్రత సెట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఫ్రిడ్జ్ సెక్షన్ లో 3°C నుండి 5°C మరియు ఫ్రీజర్ లో18°C వద్ద ఉంచాలి. ఎండకాలంలో అయితే ఉష్ణోగ్రతను ఇంకొంచెం తగ్గించుకోవచ్చు. ఇక సంవత్సరానికి కనీసం ఒకసారి ప్రొఫెషనల్ టెక్నీషియన్ చేత ఫ్రిడ్జ్ ను సర్వీసింగ్ చేసుకుంటే ఇంకా మంచిది.