సాధారణంగా తండ్రికి కూతురిపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది. కూతుళ్లకు కూడా తండ్రి పై ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రేమ అనేది ఒక ఏజ్ వచ్చే వరకే పూర్తిగా చూపించగలుగుతాం.. ముఖ్యంగా పిల్లలు పదేళ్లు వచ్చేవరకు తల్లిదండ్రుల పక్కన పడుకున్నా తల్లిదండ్రుల పక్కన ఉన్నా కానీ పెద్దగా ఏమీ ఉండదు.. కానీ 10 సంవత్సరాలు దాటి 12, 13, 14 ఏళ్ల వయసు వచ్చేసరికి వారి శరీరంలో మార్పులు రావడమే కాకుండా వారి గుణగణాల్లో, మాట తీరులో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అలాంటి ఈ సమయంలో మనం పిల్లలపై ప్రేమను చూపించాలి కానీ అతిగా రిస్ట్రిక్షన్స్ పెట్టి వారిని కించపరిచినట్టు మాట్లాడకూడదు. ఈ మూడు విషయాల్లో మాత్రం ఆడపిల్లలతో తండ్రి జాగ్రత్తగా ఉండాలని,దానివల్ల పిల్లలు కూడా హ్యాపీగా జీవిస్తారని కొంతమంది నిపుణులు అంటున్నారు.. మరి ఆ విషయాలు ఏంటి ఆ వివరాలు చూద్దాం..
 
 ఇతరులతో పోల్చడం:
 సాధారణంగా ఏ కూతురైన తండ్రికి అన్ని విషయాలను చాలా ప్రేమగా చెప్పుకుంటుంది. కానీ తండ్రి ఇతర అమ్మాయిలతో ఆ కూతుర్ని పోల్చి కించపరిచినట్టు మాట్లాడితే మాత్రం  ఆమె సహించదు. ముఖ్యంగా 14 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఇతర అమ్మాయిలతో పోల్చి వాళ్ళు ఎలా ఉన్నారో చూడు నువ్వు ఉన్నావ్ అంటూ ఏదైనా కించపరిచినట్టు మాట్లాడితే మాత్రం వాళ్ళు చాలా బాధపడతారు. అంతే కాదు మీకు ఏదైనా ఫ్రీగా చెప్పే విషయాలను కూడా అప్పటినుంచి దాచేస్తూ మన చేయి దాటిపోతారు. కాబట్టి తోటి వారితో పోల్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా మసులుకోవాలని అంటున్నారు.

 డ్రెస్సింగ్ విషయంలో కట్టుబాట్లు:
 అమ్మాయి కాస్త పెరిగిన తర్వాత డ్రెస్సింగ్ విషయంలో తండ్రి కట్టుబాట్లు పెట్టకూడదు. అంటే పూర్తిగా వారిని వదిలేయాలని కాదు. కానీ కాస్త నెమ్మదిగా వారికి అర్థమయ్యేలా చెప్పాలి. సమాజం ఎలా ఉంది. మనం ఎలా మలుచుకోవాలో అనేది మాత్రమే తెలియజేయాలి తప్ప నువ్వు ఆ డ్రెస్ వేసుకోవాలి ఈ డ్రెస్ ఏ వేసుకోవాలని వారికి రిస్ట్రిక్షన్స్ పెడితే, లోలోపల కుమిలిపోయి  ఇతరులకు దగ్గరవుతారు.

 కూతురు తండ్రికి సీక్రెట్స్ చెబితే:
 కొంతమంది కూతుర్లు 14 సంవత్సరాలు దాటిన తర్వాత  కూడా తండ్రికి వారికి సంబంధించిన సీక్రెట్స్ చెబితే వాటి గురించి ఆలోచించాలి. ముఖ్యంగా ఈ వయసులో  అమ్మాయిల మనసులో కానీ శారీరక విషయాల్లో కానీ తేడాలు ఉంటాయి. స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎవరైనా అబ్బాయి పై క్రష్ ఉందని చెబితే, ఒకేసారి కోపానికి వచ్చి వారిపై కఠినంగా వ్యవహరించడం కంటే ఆ అబ్బాయి ఎవరు, అసలు మీ కూతురు వారిపై ఎందుకు క్రష్ పెంచుకుంది అనే విషయాలపై ఆరా తీయాలి. స్నేహానికి ప్రేమకు మధ్య ఉన్న విషయాలను వివరించాలి. ఇలా చేయకుండా అబ్బాయి పేరు చెప్పగానే వారిని కొట్టడం లేదా మీ కూతుర్ని కొట్టడం చేస్తే వారు ఇక అలాంటి సీక్రెట్స్ మీకు చెప్పకుండా పూర్తిగా తప్పుటడుగు వేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: