రాజకీయాల్లో తిరుగులేని విజయాలు అందుకున్న ఎన్టీఆర్ సైతం ఒకసారి ఓటమి పాలయ్యారు. వరుసగా 1983, 1985 ఎన్నికల్లో తన హవాతో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చిన ఎన్టీఆర్...1989లో టీడీపీని గెలిపించలేకపోయారు. కాంగ్రెస్ హవాలో టీడీపీ ఘోరంగా ఓడి ప్రతిపక్షానికి పరిమితమైంది...అప్పుడు ఎన్టీఆర్ సైతం ఊహించని విధంగా ఓటమి పాలయ్యారు. 1989 ఎన్నికల్లో ఎన్టీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీకి దిగారు...ఒకటి అనంతపురం జిల్లాలోని హిందూపురం, మరొకటి తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం.

అయితే అప్పుడు హిందూపురంలో గెలిచిన ఎన్టీఆర్...కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్ధి చిత్తరంజన్ దాస్ చేతిలో ఓడిపోయారు. అలా ఎన్టీఆర్‌ని సైతం ఓడించిన కల్వకుర్తి ప్రజలు ఆ తర్వాత కాంగ్రెస్‌ని ఎక్కువ ఆదరిస్తూ వచ్చారు. తెలంగాణ వచ్చాక అంటే 2014 ఎన్నికల్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. 2018 ఎన్నికలోచ్చేసరికి టీఆర్ఎస్ సత్తా చాటింది...టీఆర్ఎస్ తరుపున జైపాల్ యాదవ్ విజయం సాధించారు. ఈయన గతంలో టీడీపీ తరుపున రెండుసార్లు కల్వకుర్తిలో గెలిచారు.

ఇలా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జైపాల్‌కు నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. సమస్యలపై అవగాహన ఉంది...పైగా టీఆర్ఎస్ అధికారంలో ఉంది. దీంతో ఆయన కల్వకుర్తిని ఏదో చేసేస్తారని అంతా అనుకున్నారు..కానీ ఈ మూడేళ్లలో కల్వకుర్తిలో జైపాల్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పెద్దగా ఏమి లేవు. ఏదో సంక్షేమ పథకాలు మాత్రం అందుతున్నాయి.

పేరుకు మాత్రం అభివృద్ధికి కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారు..కానీ ఎక్కడ అభివృద్ధి జరిగిందో కనబడదు. కల్వకుర్తి టౌన్‌లో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. రోడ్లపై చెత్త ఎక్కడపడితే అక్కడ కనిపిస్తుంది. అలాగే అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి...ఇక తాగునీటి కష్టాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక 100 పడకల ఆసుపత్రి కల నెరవేరేలా లేదు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఉంది...కానీ నియోజకవర్గంలో చివరి గ్రామాలకు సాగునీరు అందడం కష్టం.

రాజకీయంగా వస్తే..ఎమ్మెల్యే జైపాల్‌కు ఎదురుగాలి వీస్తుంది. అటు ఇక్కడ కాంగ్రెస్ నేత వంశీచందర్ రెడ్డి పికప్ అవుతున్నారు. అలాగే ఇక్కడ బీజేపీ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో కల్వకుర్తిలో ట్రైయాంగిల్ ఫైట్ జరగనుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: