సాధారణంగా మనదేశంలో ఒకప్పుడు చదువు అంటేనే చాలామంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకునేవారు అక్కడ వారికి సౌకర్యాలు ఉన్నా లేకపోయినా అక్కడే విద్యను అభ్యసించేవారు.. ఇక సౌకర్యాల విషయాన్ని పక్కన పెడితే విద్యాబోధన అనేది చాలా చక్కగా ఉండేది . ప్రత్యేకించి చాలా అనుభవం ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రయోగాత్మకంగా పాఠాలు చెప్పేవారు. అంతేకాదు విద్యార్థులకు చదువుతోపాటు క్రమశిక్షణ కూడా లభించేది. ముఖ్యంగా ఆటపాటల్లో కూడా చురుగ్గా ఉండేవాళ్ళు అందుకే ఏ సర్కారు బడి చూసినా సరే అప్పట్లో పిల్లలతో నిండిపోయి కనిపించేది.

ప్రస్తుత కాలంలో పాలిటిక్స్, సాఫ్ట్వేర్ , స్పోర్ట్స్ , బిజినెస్, సినిమా రంగాలలో అత్యున్నత స్థానాలలో ఉన్న ఎంతోమంది ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వాళ్లే.. కానీ ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలలకు పోటీగా ప్రైవేటు పాఠశాలలు వచ్చాయో ఇక అప్పటినుంచి అందరి జీవితాలు మారిపోయాయి. మెరుగైన భవిష్యత్తు కావాలి అంటే ఖర్చు చేయాల్సిందే అని విద్యాసంస్థలను కూడా రాజకీయం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు కొంతమంది దుండగులు. పేరెంట్స్ కూడా ఉన్నత విద్యను పిల్లలకు అందించాలని లక్షల ఖర్చు పెట్టి ప్రైవేటు పాఠశాలల్లోనే పిల్లలను చేర్పిస్తున్నారు అందుకే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది..

కేవలం పేద, దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన పిల్లలే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారని నిపుణులు అంచనా వేయగా.. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై సీరియస్ గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.  అందుకు తగ్గట్టుగానే ఏపీ ప్రభుత్వంలో మౌలిక వసతుల కల్పన టెక్నాలజీ వాడకంతో విద్యార్థుల శాతాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తోంది . ఇదిలా ఉండగా తాజాగా పదవ తరగతిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మంచి మార్కులు సాధించిన వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్ర జిల్లాస్థాయిలో టాప్ 2  స్టూడెంట్స్ కి  రూ.1లక్ష, రూ. 75000 , రూ.50,000 బహుమతిగా ఇస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా ప్రకటించారు. అలాగే నియోజకవర్గాలలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రూ. 15,000, రూ. 10,000 , రూ.5000 చొప్పున నగదును అందజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: