
ఇండియాలో కూడా నోట్ల ను దశల వారీగా రద్దు చేసి ఎక్కువగా డిజిటల్ కరెన్సీ రూపంలోకి మారితే అది అతి పెద్ద విజయం సాధించనట్లు అవుతుంది. అనిల్ బోకిల్ అనే వ్యక్తి డిమానిటైజేషన్ అనే విషయం గురించి అనేక పుస్తకాలు రాశారు. అర్ధ క్రాంతి వ్యవస్థాపకుడైన అనిల్ బోకిల్ చాలా మంది ప్రధానమంత్రులను కలిసి డిమానీటైజేషన్ గురించి వివరాలు చెప్పారు. పీవీ నరసింహ రావు, వాజ్ పేయి, ఇలా అనేక మంది ప్రధానులను కలిసి నోట్ల రద్దు అంశం, భారత ఆర్థిక వ్యవస్థ పురోగమనం గురించి చెప్పారు. కానీ ఆ ప్రధానమంత్రులెవరూ పట్టించుకోలేరు.
కానీ నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక 8 నిమిషాల టైం ఇచ్చి మీ ప్రధాన అజెండా చెప్పండని అడిగారు. అనంతరం ఎనిమిది నిమిషాల మీటింగ్ కాస్త రెండు గంటలకు పైగా కొనసాగింది. మొత్తం వివరాలు రాసుకొచ్చారు. అదే ప్రస్తుతం దశల వారీగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నోట్ల రద్దు అనే ప్రతిపాదన తీసుకొచ్చింది అనిల్ బోకిల్ అనే వ్యక్తి అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. డీమానిటైజేషన్ అనేది ప్రత్యేకించి ఎలా చేయాలి. ఏ విధంగా ముందుకెళ్లాలి. వచ్చే సమస్యలు ఏమిటి.. ఎలాంటి పరిస్థితులు ఎదరవుతాయని మోదీకి ఆయన సూచించారు.