సినిమా ఇండస్ట్రీలో విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ ఆ మద్య ‘విశ్వరూపం’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు.  ఈ సినిమా రిలీజ్ కి ముందు..రిలీజ్ తర్వాత ఎన్నో కాంట్రవర్సీలు సృష్టించింది.  మొత్తానికి సినిమా థియేటర్లో సక్సెస్ ఫుల్ గా నడిచింది.  ఇక విశ్వరూపం 2 సినిమా కమల్ స్వియ నిర్మాణంగా తెరకెక్కబోతుంది.  నిర్మాతగా, నటుడిగా ‘విశ్వరూపం2’ లో కమల్ హాసన్ నిజంగానే తన విశ్వరూపాన్ని చూపించినట్లు తెలుస్తుంది.  తాజాగా హైద‌రాబాద్‌లో విశ్వ‌రూపం 2 మూవీ తెలుగు వ‌ర్షెన్‌కి సంబంధించి ఆడియో వేడుక నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా తెలుగు వ‌ర్షెన్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానున్న విశ్వరూపం 2 చిత్రంలో రాహుల్ బోస్, పూజా కుమార్ మరియు ఆండ్రియా, నాజ‌ర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇండియాలోనే కాదు విదేశాల‌లోను విశ్వ‌రూపం 2 మూవీపై భారీ ఆస‌క్తి నెల‌కొంది.   ఈ చిత్ర త‌మిళ వ‌ర్షెన్‌కి సంబంధించిన‌ ట్రైల‌ర్ ఇటీవ‌ల విడుద‌ల కాగా, ఇది సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది. ఈ సినిమాలో తీవ్రవాదంపై రా ఆఫీసర్ యుద్ధం ఏంటి? అన్నది తెరపై చూపించారని ట్రైలర్ వీక్షిస్తే అర్థమవుతోంది.
Image result for విశ్వరూపం 2 ట్రైలర్
ఇక  పూజా కుమార్ - ఆండ్రియా పాత్రలకు సంబంధించిన సస్పెన్స్ ని పార్ట్ 2లోనే రివీల్ చేయనున్నారు. నీవెవరు? అంటూ పూజా కుమార్ ట్రైలర్ లో ప్రశ్నిస్తోంది అంటే .. అసలు ఆ ఇద్దరు తొలి భాగంలో భార్యభర్తలేనా? అన్న సందేహం రాకుండా ఉండదు. ఇకపోతే ఆండ్రియా పాత్ర ఏంటనేది పోస్టర్ లలోనే సస్పెన్స్ రివీల్ చేశారు.
Image result for విశ్వరూపం 2 ట్రైలర్
తనుకూడా ఓ ఆర్మీ ఆఫీసర్. తనకు శిక్షణనిచ్చింది రా ఆఫీసర్ కశ్మీరీ. ఇక రాహుల్ బోస్ పాత్ర కమల్ స్థాయిని ఎలివేట్ చేసే ఓ డైలాగ్ ని చెప్పడం విశేషం. వాడు అల్ ఖైదాకే ట్రైనింగ్ ఇచ్చినోడు! అంటూ అదిరిపోయే పంచ్ వేశాడు. టనను మించి మేకింగ్ ని ఇష్టపడే కమల్ స్క్రీన్ ప్లేలోనూ  ఇంటర్నేషనల్ లెవల్ అని `విశ్వరూపం 2` నిరూపిస్తుందనడంలో సందేహం లేదు.  ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది ‘విశ్వరూపం 2’.



మరింత సమాచారం తెలుసుకోండి: