
బాహుబలి 2 తర్వాత ప్రభాస్ ని వెండి తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వారందరికీ ఈ రోజు ఓ పండుగ అనే చెప్పొచ్చు. తమ అభిమాన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సాహూ’ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. తాజాగా విడుదలైన సాహో ట్రైలర్ సినిమా పై అంచనాలని భారీగా పెంచేసింది. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు, ప్రభాస్, శ్రద్ధా కపూర్ల రొమాన్స్‌తో పాటు నేపథ్య సంగీతం కూడా బాగుంది.
మొదటి నుంచి హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని చెప్పారు..ఇప్పుడు చూపించారు. అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని చిత్ర బృందం చెబుతుంది. రూ.300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో స్పై థ్రిల్లర్‌గా ‘సాహూ’మూవీని సుజీత్ తెరకెక్కించారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటిస్తుంది. ఈ మూవీని వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. సాహూ తెలుగు, హిందీ, తమిళంతో పాటు ఇతర భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు చిత్ర నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ఏర్పాట్లు చేస్తుంది.
దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ప్రభాస్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది సేపట్లోనే విపరీతమైన లైక్స్ వస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ దాహార్థిని తీర్చడానికి ఈ ఒక్క ట్రైలర్ చాలాని ఫ్యాన్స్ తెగ ఖుషీ ఖుషీ అవుతున్నారు.
ఈ మూవీలో మరికొన్ని ముఖ్యపాత్రల్లో వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ఇందులో నీల్ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్, ఎవ్లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, లాల్ వంటి టాప్ స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి గిబ్రాన్ సంగీతం అందించారు.