
ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్ అంటే తెలియనివారుండరు. ఐపీల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ , ప్రపంచ కప్ లో ధావన్ స్థానం లో ఓపెనర్ గా రాణించి అందరి మన్నలను పొందాడు . రాహుల్ క్రికెట్ మైదానం లో బౌలర్లపై విరుచుకుపడుతూ...తనదైన స్టయిలిష్ లుక్ తో అమ్మాయిల మనస్సులను కొల్లగొట్టేస్తున్నాడు . భారత క్రికెట్ జట్టు లో మిగతా ఆటగాళ్లతో పోలిస్తే , అమ్మాయిల్లో ఇతగాడికి మంచి పాలోయింగే ఉంది . కేఎల్ రాహుల్ కూడా తక్కువేమీ కాదు. తనకు నచ్చిన వారితో డేటింగ్ అంటూ ఇప్పటికే బోలెడు మంది తో ప్రేమాయణం నడిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి తో రాహుల్ డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి . అయితే రాహుల్ ఎంతమంది అమ్మాయిలతో డేటింగ్ చేసినప్పటికీ, తన ఫస్ట్ క్రష్ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చి అందరినీ షాక్ కు గురి చేశాడు. ఎందుకంటే రాహుల్ ఫస్ట్ క్రష్ ఒక ఆంటీ కావడం విశేషం. బాలీవుడ్ ఐటమ్ భామ... కండలవీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ మాజీ భార్య మలైకా అరోరా తన ఫస్ట్ క్రష్ అని రాహుల్ చెప్పడం తో అందరూ అవాక్కయితే , ఆమెతో పీకల్లోతు ప్రేమాయణం లో ఉన్న బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ పరిస్థితి ఏమిటో ఇప్పుడు అని కొందరు సెటైర్లు వేస్తున్నారు .
మలైకా ప్రేమలో మునిగిపోయిన అర్జున్ కపూర్ ఆమె కంటే చిన్నవాడైతే , రాహుల్, అర్జున్ కపూర్ కంటే మరిచిన్నవాడు కావడం విశేషం . మలైకా , అర్జున్ ఇద్దరి ప్రేమాయణంలో కి ఎక్కడ రాహుల్ ఎంట్రీ ఇస్తాడోనని మరికొందరు జోకులు పేలుస్తున్నారు .