తన బిడ్డ అందంగా ఉండాలని అనుకోవడం సాధారణంగా అందరిలో కనిపించే అంశం.  పుట్టబోయే బిడ్డ ఆడ పిల్లే కావాలని కొందరు....కాదు మగ పిల్లాడే  కావాలని కోరుకోవడం కూడా చూస్తుంటాం.పోరపాటున ఆ బిడ్డ ఎదిగాక గే అని తెలిస్తే కన్న వాళ్ళే ఇంటి నుండి గెంటేస్తారు.  కానీ అందరికీ బిన్నంగా తనకు పుట్టబోయే బిడ్డ 'గే' అయినా ఏం ఫర్వాలేదు అనేసి షాకిచ్చింది బాలీవుడ్ భామ కల్కి కొచ్లిన్. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ రిలేషన్,ఎమోషన్స్ విషయాల్లో ఎంత ఓపెన్‌గా ఉంటున్నారో అంతే ఓపెన్‌గా మాట్లాడేస్తున్నారు. 

ఇక బాలీవుడ్ హీరోయిన్స్‌కైతే సహజీవనం, పెళ్ళికి ముందు గర్భం లాంటివైతే పిచ్చ లైట్. అయితే తాజాగా ఇలాంటి విషయంలోనే మరో అడుగు ముందుకేసి తనకు పుట్టబోయే బిడ్డ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ కల్కి కొచ్లిన్. పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఈమె చేసిన ఈ కామెంట్స్ జనాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన కల్కి.. త్వరలోనే తాను తల్లిని కాబోతున్నానని తెలిపింది. 

అంతటితో ఆగక తనకు పుట్టబోయే బిడ్డ ఆడ, మగ లేదా థర్డ్ జెండర్ (గే) అయినా డోంట్ కేర్ అని అనేసి ఒక్కసారిగా షాకిచ్చింది. ప్రస్తుతం తాను మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపింది కల్కి.బాలీవుడ్ భామ కల్కి కొచ్లిన్ ప్రస్తుతం ఇజ్రాయెల్ లోని జెరూసలెంకు చెందిన పియానిస్ట్ గయ్ తో ప్రేమలో మునిగి తేలుతోంది. ఆయనతో సహజీవనం చేసిన కల్కి.. పెళ్లి చేసుకోకుండానే తల్లి కాబోతోంది. గతంలో బాలీవుడ్ డైరెక్టర్, యాక్టర్ అనురాగ్ కశ్యప్‌ను పెళ్లి చేసుకున్న కల్కి కొచ్లిన్.. 2015 సంవత్సరంలో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

తాను ప్రస్తుతం ఐదు నెలల గర్భవతిని అని, ఎప్పుడు బిడ్డను కనాలి.. ఆ బిడ్డతో ఎప్పుడు, ఎలా కనెక్ట్‌ కావాలో తనకు బాగా తెలుసని పేర్కొంది కల్కి. గర్భవతి కావడం పట్ల స్పెషల్ రూల్స్ ఏవీ పెట్టుకోలేదని చెప్పింది.కానీ గోవాలో పురుడు పోసుకోవాలని అనుకుంటున్నానని తెలిపింది. దేవ్‌ డీ, రిబ్బన్‌, గల్లీబాయ్‌ సినిమాల్లో నటించి మెప్పించింది కల్కి.


    మరింత సమాచారం తెలుసుకోండి: