స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అలవైకుంఠపురములో. గత ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ కి పీఎస్ వినోద్ ఫోటోగ్రఫి అందించగా, థమన్ మ్యూజిక్ అందించాడు. హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు ఈ సినిమా ని ఎంతో భారీగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విషయం తెలిసిందే.

జయరాం, మురళీశర్మ, టబు, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాని మంచి ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించారు. ఇక ఇందులోని సాంగ్స్ కి జాతీయ స్థాయిలో శ్రోతల నుండి విశేషమైన స్పందన లభించిన విషయం తెల్సిందే. ముఖ్యంగా రాములో రాముల, బుట్ట బొమ్మ, సామజవరగమనా సాంగ్స్ అయితే యూట్యూబ్ లో ఏకంగా వందల మిలియన్ల వ్యూస్ దక్కించుకుని ఇప్పటికీ కూడా మంచి రెస్పాన్స్ తో దూసుకెళ్తున్నాయి. అయితే ఆ మధ్య ఈ సినిమాలోని రాములో రాముల సాంగ్ గతంలో వచ్చిన ఒక ఫోక్ సాంగ్ కి కాపీ అంటూ పలు వార్తలు మీడియా మాధ్యమాల్లో ప్రచారమయిన విషయం తెలిసిందే.

ఇక లేటెస్ట్ గా ఈ సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్ ఆడియో, వీడియో ల పరంగా ఎంతటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సాంగ్ లోని డ్యాన్స్ కాపీ అంటూ ప్రస్తుతం ఒక వీడియో ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. గతంలో తమిళ స్టార్ విక్రమ్ నటించిన అరుళ్ మూవీలోని ఒక సాంగ్ స్టెప్స్ ని బుట్ట బొమ్మ సాంగ్ కోసం వాడుకున్నారని, ఆ విధంగా జానీ మాస్టర్ కాపీ కొట్టారని కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అయితే ఆ సాంగ్ లో అక్కడక్కడా కొన్ని స్టెప్స్ బుట్ట బొమ్మ కి మ్యాచ్ అయిన విషయం నిజమేనని, కానీ ఒక్కో సందర్భంలో ఎక్కడో అక్కడక్కడ కొన్ని స్టెప్స్ ఒకేవిధంగా ఉండడం యాదృచ్చికంగా జరుగుతుందని, అయితే దానిని పట్టుకుని బుట్ట బొమ్మ సాంగ్ లోని స్టెప్స్ కాపీ కొట్టారు అని అనడం సరైనది కాదని పలువురు బన్నీ ఫ్యాన్స్  అంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ మ్యాటర్ పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: