వకీల్ సాబ్ సినిమా మరో మూడు రోజుల్లో రిలీజ్ ఉంది.. చిత్ర బృందం మొత్తం ప్రమోషన్స్ లో పాల్గొంటూ బిజీ గా ఉంది.. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ మాత్రం ఇంతవరకు ఒక్క ప్రమోషన్స్ లో కూడా కనిపించలేదు.. నార్మల్ గా ఏ సినిమా కి అయినా హీరోయిన్ లు ప్రమోషన్స్ లో పాల్గొంటారు. కనీసం ఆడియో ఫంక్షన్ లో అయినా పాల్గొంటారు కానీ శృతి హాసన్ మాత్రం దానికి రాలేదు. దీనికి కారణం ఏంటో అని అభిమానులు ఆరాధిస్తున్నారు..

కమల్ హాసన్ కుమార్తె గా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన శృతి హాసన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్ అనేంతగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది.ఇటీవలే ఆమె నటించిన క్రాక్ సినిమా సూపర్ హిట్ కావడం తో శృతి హసన్ కి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఈ సినిమా హిట్ తో హీరోకి, డైరెక్టర్ ఎంతవరకు కలిసి వచ్చిందో కానీ హీరోయిన్ శృతి హసన్ కి మాత్రం మంచి పేరుతో అవకాశాలు కూడా వస్తున్నాయి.. ఈ సినిమా ముందువరకు శృతి హాసన్ కెరీర్ ఆల్మోస్ట్ అయిపోయిందనుకున్నారు అంతా.. చేతిలో సినిమాలు కూడా ఏవీ లేవు.. క్రాక్ హిట్ తో ఆమెకు వకీల్ సాబ్ , సలార్ సినిమా ఆఫర్ లు వచ్చాయి..

ఈనేపథ్యంలో ఆమె వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్స్ కి రాకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శృతి హాసన్ ఉందన్న విషయం యూనిట్ అంతా మర్చిపోయినట్లుంది.. పవన్ కళ్యాణ్ కూడా అందరి గురించి వెల్లడించి శృతి గురించి మాట్లాడలేదు. అయితే దీనివెనుక ఏదైనా కారణం ఉందా లేదా కావాలనే ఇలా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. రిలీజ్ కి ఇంకా మూడు రోజులువుంది. ఈ గ్యాప్ లో ఆమెతో ఏదైనా ప్రమోషన్ ప్లాన్ చేస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: