
తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తన నటనకు ఫిదా అయిన బాలీవుడ్ దర్శకుల వరుస అవకాశాలు ఇచ్చారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోయిన్లు ఉన్నప్పటికీ తాప్సీ మాత్రం వరస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుం.ది గ్లామర్ పాత్రల్లో కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసుకుంటూ సక్సెస్ సాధిస్తుంది తాప్సీ పన్ను. అయితే ఇక టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ టాలీవుడ్లో సినిమాలకు మాత్రం దూరం అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక తాప్సీ పన్ను టాలీవుడ్ లో సినిమా చేసి దాదాపు మూడేళ్లు అవుతుంది.
దీంతో తాప్సీ అభిమానులందరూ మరోసారి తాప్సి టాలీవుడ్ లో సినిమా చేస్తే బాగుంటుంది అని భావిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న తాప్సీ పన్ను.. మరోసారి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే ఒక సినిమాను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు స్వరూప్ డైరెక్షన్లో తాప్సీ సినిమా చేసేందుకు సిద్ధమైందట దర్శకుడు స్వరూప్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన కథ తాప్సికి వినిపించగా ఇక ఈ కథ ఈ అమ్మడికి బాగా నచ్చేసిందట దీంతో సినిమా చేసేందుకు సైన్ కూడా చేసిందట. సినిమాకు మిషన్ ఇంపాజిబుల్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.