
సెలబ్రిటీలు బయటకు వస్తే వారిని చూసేందుకు జనాలు, వారి అభిమానులు ఎంతలా ఎగపడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వారిని చూసేందుకు భారీగా తరలి వచ్చే అభిమానుల నుంచి వారిని రక్షించేందుకు బాడీగార్డ్‌లు ఎంతో కష్టపడుతూ ఉంటారు. సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలే కాకుండా... సినిమా హీరోలు, హీరోయిన్లకు కూడా సాధారణ జనాలు, అభిమానుల నుంచి పబ్లిక్ ప్లేసుల్లో ఇబ్బంది తప్పదు. వీరిని చూస్తే చాలు.. మీదకు మీదకు వచ్చి సెల్ఫీలు దిగడం, ఆటోగ్రాఫ్ అంటూ ఎగబడడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే స్టార్ హీరోలే కాదు హీరోయిన్లు కూడా బాడీగార్డ్‌లను నియమించుకుంటుంటారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొణే కూడా బాడీగార్డ్‌లను నియమించుకుంది. దీపిక బాడీగార్డ్‌లలో టాప్ బాడీగార్డ్ జీతం ఎంతో తెలిస్తే కళ్లు తిరిగి మతిపోతుంది మనకు.. ! బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ పక్కన ఓం శాంతి ఓం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దీపికా పడుకొణే చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. దీపిక కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆమె బయటకు వెళితే చాలు అభిమానులు చుట్టు ముట్టేస్తారు. ఆమెను జనాల నుంచి కాపాడుకునేందుకు కొందరు బాడీగార్డులు ఉన్నా.. వీరిలో టాప్ బాడీగార్డ్ ఒకరు ఉన్నారు. ఆ బాడీగార్డ్ పేరు జలాల్.
దీపిక ఎక్కడ అవుట్ డోర్‌కు వెళ్లినా అతడు దీపికను ఎప్పటికప్పుడు కాపాడుతూ వస్తాడు. అతడి నెల జీతం అక్షరాలా రు 6.5 లక్షలు. ఈ లెక్కన ఏడాదికి జలాల్ కు 80 లక్షల వరకు వస్తుందట. ఓ ఎంఎన్ సీ కంపెనీలో చేసే టీమ్ లీడర్‌కు కూడా బహుశా ఇంత జీతం రాకపోవచ్చు. అయితే జలాల్ ను దీపిక తన సొంత సోదరుడిలా భావించడంతో పాటు ప్రతి యేటా రాఖీ పండుగ రోజు రాఖీ కూడా కడుతుందట. ఇక దీపిక తన భర్త రణవీర్ సింగ్‌తో కలిసి నటించిన సినిమాతో పాటు ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకు కూడా సైన్ చేసిన సంగతి తెలిసిందే..!