
ఇకపోతే ఇక తెలుగులో మంచి విజయాన్ని సాధించిన హిట్ సినిమాను హిందీలో కూడా రీమేక్ తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఇటీవలి కాలంలో ఎన్నో టాలీవుడ్ సినిమాలు అటు బాలీవుడ్ లో రీమేక్ చేస్తూ అక్కడి హీరోలు మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికే అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ తెరకెక్కి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం నాని జెర్సీ సినిమా కూడా హిందీ రీమేక్ తెరకెక్కుతోంది. ఇక ఇప్పుడు మాస్ కా దాస్ విశ్వక్సేన్ హీరోగా నటించిన 'హిట్' సినిమాను కూడా హిందీలో రీమేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు దర్శక నిర్మాతలు. గత కొన్ని రోజుల నుంచి దీనికి సంబంధించిన వార్తలు వైరల్ గా మారిపోయాయి.
అయితే హిందీ హిట్ రీమేక్ లో విశ్వక్సేన్ పాత్రలో రాజ్ కుమార్ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు నటించబోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక తాజాగా హీరోయిన్ పై కూడా క్లారిటీ వచ్చింది. హిట్ హిందీ రీమేక్లో సన్యా మల్హోత్రా హీరోయిన్ గా నటించబోతున్న తెలుస్తుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ స్పష్టం చేసింది. గతంలో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన దంగల్ సినిమా లో సన్యా మల్హోత్రా నటించింది. ఇకపోతే ప్రస్తుతం హిట్ 2 తెరకెక్కించేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈసారి హిట్ లొ విశ్వక్ సేన్ కి బదులు అటు అడివి శేష్ హీరోగా నటించబోతున్నట్లు విషయం తెలుస్తుంది.