మిల్కీ బ్యూటీ తాప్సీ పన్నూ  బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ మాథియాస్ బోతో కలిసి లంచ్ కి వెళ్ళింది. అయితే అది సాదాసీదా లంచ్ కాదు. దానికో స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటంటే... తాప్సి బాయ్ ఫ్రెండ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ లవ్ బర్డ్స్ ఇద్దరూ కలిసి 'బర్త్ డే లంచ్'కి వెళ్లారు. తాప్సీ ఆ పిక్స్ ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ మాథియాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకొచ్చింది. 

తాప్సీ, బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న పిక్స్ చూసిన నెటిజెన్స్ కూడా మథియాస్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. కాగా ఈ స్పెషల్ లంచ్ లో మాథియాస్, తాప్సితో పాటు ఆమె సోదరి షాగున్ పన్నూ కొంతమంది స్నేహితులు కూడా పాల్గొన్నారు. వీరంతా రెస్టారెంట్ లోని ప్రైవేట్ లంచ్ ప్లేస్ లో కూర్చున్నట్లు కనిపిస్తోంది. ఇక మాథియాస్ "బెస్ట్ లంచ్ ఇన్ ది బెస్ట్ కంపెనీ" అంటూ తన 41వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం వీరిరువురూ షేర్ చేసిన పిక్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. 

ఇక మాథియాస్ మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు అన్న విషయం తెలిసిందే. మరోవైపు తాప్సి సైతం బాలీవుడ్ లో వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. బాలీవుడ్ లో ఇటీవల తాప్సి ప్రధాన పాత్రలో నటించిన "హసీన్ దిల్ రూబా" చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం ప్రశంసలతో కంటే ట్రోలింగ్ తో వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ టాప్ హీరోయిన్ ఖాతాలో మిథాలీ రాజ్ బయోపిక్ 'శభాష్ మిథు', 'లూప్ లాపెటా’, ‘రష్మి రాకెట్’, ‘దోబారా’ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. త్వరలోనే తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించడానికి తాప్సి సిద్ధమవుతోంది. "మిషన్ ఇంపాజిబుల్" అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: