టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా రామానాయుడు ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు తెలుగు సినిమా ప్రజలకు అందించాడు. ఆయన నిర్మాతగానే ప్రతి ఒక్కరికి ఇంతవరకు తెలుసు కానీ నటుడిగా కూడా కొన్ని సినిమాల్లో నటించారని చాలా తక్కువ మందికి తెలుసు. హీరోల బలవంతం వల్లనో, దర్శకులతో మైత్రి వల్లనో ఏదో ఒక కారణంతో ఆయన కొన్ని సినిమాలలో నటుడిగా నటించక తప్పలేదు. ఆ విధంగా 1968 లో వచ్చిన పాప కోసం సినిమా ను రామానాయుడు స్వయంగా నిర్మించడమే కాకుండా ఇందులో పాత్రను కూడా పోషించారు. దొంగల్లో కూడా మానవత్వం ఉంటుంది అనే పాయింట్ తో ఈ సినిమా రూపొందించారు.

సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన ఆర్ శేషగిరిరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మోహనరావు ఇంట్లో అర్థరాత్రి పూట ప్రవేశించి కుటుంబం మొత్తాన్ని ఆ ఇంట్లో వాళ్లందరినీ కాల్చేసి ఆ జమీందారు ఇంట్లోని నాలుగేళ్ల పాప ను తమతోపాటు తీసుకువెళ్లిన ముగ్గురు దొంగల కథ ఈ సినిమా. మూడు భిన్న మతాలకు చెందిన ముగ్గురు దొంగలు గా సత్యనారాయణ, త్యాగరాజు, రామదాసు నటించగా పాపగా బేబీ రాణి నటించింది. ఈ పాప పెద్దయ్యాక ఆ పాత్రను విజయనిర్మల పోషించింది. ఆమెను పెళ్లి చేసుకునే వ్యక్తిగా రామానాయుడు నటించారు.

 ఈ ఇద్దరు కూడా అతిధి పాత్రలో కనిపించడం గమనార్హం. ఇక్కడ విశేషం ఏమిటంటే విజయనిర్మల తండ్రి పాత్రను ఆ తర్వాత కాలంలో ఆమె భర్త అయిన సూపర్ స్టార్ కృష్ణ చేయడం. కాకపోతే విజయ నిర్మల చిన్నప్పటి పాత్రకే ఆయన సన్నివేశాలు పరిమితమయ్యాయి. రామానాయుడు ఆ తరువాత చాలా రోజులకు అల్లరి నరేష్ హీరోగా నటించిన కత్తి కాంతారావు సినిమా లో గెస్ట్ పాత్ర చేశారు. ఆయన వారసులు సురేశ్ బాబు నిర్మాతగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. వెంకటేష్ మాత్రం హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఉన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: