ప్రముఖ సీనియర్ నటి, దివంగ‌త‌ జయంతి.. తన కళ్లతోనే హావభావాలను పలికించి,  ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసేది. అంతేకాదు ఈమె నవరసాలను మోములో కనిపించేలా చేసి, ఆ చూపరులను ఇట్టే ఆకట్టుకునే జయంతి. ఇండస్ట్రీలో బాలనటిగా, కథానాయికగా, సహాయ నటిగా ఎన్నో సంవత్సరాల పాటు కొనసాగి , ఎంతో మంది సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మధ్యకాలంలో మరణించి ఎంతో మంది సినీ ప్రియులను నిరాశపరిచింది అనే చెప్పవచ్చు. ఇక ఎక్కువగా ఆనాటి తారలను అభిమానించే వారిలో సావిత్రి, జమున తర్వాత జయంతి అని చెప్పవచ్చు.. అంతలా ఈమె  ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసేది.

ఒకానొక సమయంలో ఆమె ఇంటర్వ్యూ కి ఇచ్చిన ఒక మాట ప్రస్తుతం వైరల్ గా మారింది.. అదేమిటంటే. ఆమె కు నటనలో బాగా సపోర్ట్ ఇచ్చి ఆమెను ఇంత పెద్ద స్టార్ గా తయారు చేయడానికి ఆయనే కారణమట..ఇక అతను  ఎవరో తెలుసుకుందాం.. అప్పట్లో ఆమె మాట్లాడుతూ..నేను నటించిన  ఎన్నో సినిమాల్లో నాకు బాగా నచ్చినవి జగదేకవీరుని కథ , సుమంగళి.. ఇందులో అగ్రతారలైన సావిత్రి, ఏఎన్ఆర్ , ఎస్.వి.రంగారావు వంటి ఎంతోమంది కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో నేను కూడా స్పెషల్ సాంగ్ లో చేయడం జరిగింది..

ముఖ్యంగా నేను అందులో నటించడానికి కారణం అగ్రతారల అంతా ఉన్నారని.. ఆ పాటలో భాగంగానే శోభన్ బాబు.. ఆయన నా మీద చేయి వేసినప్పుడు నాకు ఎలా నటించాలో తెలియలేదు. అలా ఆయన నే చూస్తూ ఉండిపోయాను.. ఇక దర్శకుడు కట్ చెప్పేసాడు. అప్పుడు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్న కె.విశ్వనాధ్ నా దగ్గరకు వచ్చి.. ఏయ్.. బండ పిల్ల..! ఏం చూస్తున్నావ్ ..ఏంటి అలా నిల్చుంటావ్..? ఇక అబ్బాయి నీ పై చేయి వేశాడు అంటే ఎలా పలకరించాలో కూడా నీకు తెలియదా.. ? అని అన్నారట‌.

నిజంగా నాకు తెలియదు సార్ అని అన్నాను.. అలా అనడంతో ఆయన నా దగ్గరకు వచ్చి,  నటనకు సంబంధించిన అన్ని అంశాలను కూడా పూర్తిగా నేర్పించారు. నా మోములో  నవరసాలను పండిస్తూ అందరినీ ఆకట్టుకోవడానికి వీలు కల్పించారు. అందుకే ఆయనను నా నటన దేవుడిగా ఎప్పుడు అభివర్ణిస్తుంటారు అని తెలిపింది జయంతి.


మరింత సమాచారం తెలుసుకోండి: