ప్రస్తుతం టాలీవుడ్ సినీ ప్రేక్షకుల అందరిలో ఒకటే విషయం చర్చకు వస్తుంది. అదే సెప్టెంబర్ 10న విడుదల కాబోతున్న సినిమాలు. ఆ రోజున మూడు సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అవి కూడా మంచి క్రేజ్ వున్న పెద్ద హీరోల సినిమాలు. ఇందులో కొత్తేముంది.. గతంలో చాలా సార్లు పెద్ద హీరోల సినిమాలు నాలుగైదు దాక ఒకేరోజు వచ్చాయి అని అనుకోవచ్చు. కానీ ఇక్కడే అసలు విషయం ఉంది. వీటిలో రెండు సినిమాలు వేరు వేరు ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లలో వస్తుండగా ఇంకొక సినిమా మాత్రం డైరెక్ట్ గా థియేటర్లలోనే విడుదలవుతుంది. ఇది టాలీవుడ్ సినీ జనాలను నిర్మాతలను ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా వినాయక చవితి సందర్భంగా థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని ఇటీవలే చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో అదే రోజున హాట్ స్టార్ లో నితిన్ నటించిన మ్యాస్ట్రో సినిమా అలాగే అమెజాన్ ప్రైమ్ లో నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దీంతో ఒక్కసారిగా ఈ రెండు సినిమాలపై టాలీవుడ్ నిర్మాతలు ధ్వజమెత్తుతున్నారు.

అసలే సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రావట్లేదని తెలిసినా రిస్క్ చేసి ఒక మంచి సినిమాను ప్రేక్షకుల కోసం క్రేజ్ వున్న సినిమాను తీసుకు వస్తున్నాం.  అయితే అదే రోజున అదే రేంజ్ లో క్రేజ్ ఉన్న సినిమాలను ఓటీటీ లో విడుదల చేయడం ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి సంబంధించిన ఓ ప్రెస్ మీట్ నిర్వహించి నాని మరియు నితిన్ లను హెచ్చరించారు. వెంటనే తమ సినిమాల విడుదలను ఆపేసి వేరే తేదీ విడుదల చేసుకోవాలని  వారు చెప్పారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన ఈ రెండు ఓటీటీ సంస్థలు ఒక్క తెలుగు మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని ఈ విడుదలను వాయిదా వేస్తాయా అనేది చూడాలి. ఇకపోతే నాని 37 కోట్ల కు కు నితిన్ హాట్ స్టార్ కు 32 కోట్ల కు తమ సినిమా లను కొనుగోలు చేశారు అన్నది టాలీవుడ్ వర్గాల అంచనా. 

మరింత సమాచారం తెలుసుకోండి: