మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో వైవిధ్యభరితమైన చిత్రం గా తెరకెక్కింది చంటబ్బాయి. మెగాస్టార్ చిరంజీవి ని ఇంతకు ముదు ఎప్పుడూ అలా చూడలేదు. పూర్తిగా కామెడీ నేపథ్యం ఉన్న పాత్రలో చిరంజీవి ఎంతగానో ప్రేక్షకులను అలరించాడు. డిటెక్టివ్ పాత్రలో కామెడీ తో మిళితమై ఉన్న సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకులలో నవ్వుల పువ్వులు పూయించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ను జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భీమవరపు బుచ్చిరెడ్డి నిర్మించాడు. రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమా ఆద్యంతం హాస్యంతో సాగుతూ ఈ సినిమాలో చివరి లో కాసేపు కరుణ రసం కురుస్తుంది.

డిటెక్టివ్ పండు అతని అసిస్టెంట్ గణపతి చేసే కామెడీ ప్రేక్షకులకు కితకితలు పెట్టించి వారి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక చంటబ్బాయిలం మేము అంటూ వచ్చిన వారి గోల వారి భార్య లో ఒక ఆమె కవితల రొద అన్ని అలరించాయి. హీరోయిన్ సుహాసిని, ముచ్చర్ అరుణ తదితరులు ప్రేక్షకులను తమ తమ పాత్రలతో అలరించారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి బావ ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్ ఈ సినిమా లో ప్రత్యేక పాత్ర పోషించి ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు.

 ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏమిటంటే ఓ పాటలో చిరంజీవి చార్లీచాప్లిన్ గెటప్ వేసి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈరోజు తో ఈ సినిమా విడుదలై 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే రోజున ఈ చిత్రం విడుదల అవడం విశేషం. ఇక ఈ చిత్రం వెండితెర మీద ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది అని అనేక వార్తలు అప్పట్లో బాగా వచ్చాయి కానీ బుల్లితెరపై ఈ చిత్రం వచ్చినప్పుడు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమాను చూడడం విశేషం. డిటెక్టివ్ గా కామెడీ చేయడంలో మెగాస్టార్ చిరంజీవి ఇతర హీరోల ను మించి పోయాడు అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: