అన్న చెల్లెల అనుబంధానికి రూపానికి ప్రతిరూపం రాఖి. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రత్యేకమైన రోజుగా ఈ రోజునీ భావిస్తారు. అమ్మ లో మొదటి అక్షరం నాన్న లో చివరి అక్షరం కలిసి ఏర్పడిన పదం అన్న. అలా అన్నా చెల్లెల్ల అనుబంధాల నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో అన్నా చెల్లెలు సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా హిట్లర్.  ఇది తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అలాగే బాలకృష్ణ హీరోగా నటించిన ముద్దుల మావయ్య అనే సినిమా అన్న చెల్లెల సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

 ఆ తరువాత యువరత్న రాణా సినిమా కూడా సిస్టర్ సెంటిమెంట్ తో బాలయ్య చేయడం విశేషం. యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన పుట్టింటికి రా చెల్లి సినిమా కూడా అన్నా చెల్లెల నేపథ్యంలో తెరకెక్కింది.ఈ సినిమా అన్ని తరగతుల తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కోడిరామకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన అర్జున్ అక్క తమ్ముళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కగా ఈ తరం ప్రేక్షకులకు సోదరీ సోదరులారా ఆప్యాయతను తెలియపరిచిన సినిమా ఇది. 

ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమా ప్రస్తుత జీవన శైలి కి సరిగ్గా సరిపోయిన సినిమా. మహిళలపై పురుషులు జరుపుతున్న మానసిక లైంగిక దాడులపై సింహంలా విరుచుకు పడే యువకుడిగా ఎన్టీఆర్ ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు. ఈ సినిమా ఆపదలో ఉన్న ఆడ వారికి ఎంతో ఆత్మ స్థైర్యాన్ని కలిగించే సినిమాగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన చెల్లెలు సంతోషం కోసం ఎంతటి ఆ పదునైన ఎదుర్కోవడానికి సిద్ధం అయ్యే పాత్రలో పవన్ కళ్యాణ్ అన్నవరం సినిమా చేసి హిట్టు అందుకున్నాడు. పెళ్లి హైదరాబాద్కు వచ్చిన చెల్లెలు సంతోషం కోసం అక్కడ రౌడీలతో పెద్ద యుద్ధమే చేస్తాడు.  గోరింటాకు సినిమా తో అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ సినిమా ను రాజశేఖర్ తెలుగు ప్రేక్షకులనున్మెప్పించి మరొక హిట్ ను సంపాదించుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: