టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెలుగు తెరకు పరిచయం అయిన సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఆ మూవీ బాగానే సక్సెస్ సాధించింది. ఆ తరువాత గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలు చేసి వాటితో కూడా మంచి విజయాలు అందుకున్న పవన్, ఆపై కరుణాకరన్ తీసిన తొలిప్రేమ మూవీ తో బిగ్ సక్సెస్ కొట్టారు. దాని తరువాత అరుణ్ ప్రసాద్ తో తమ్ముడు, పూరి జగన్నాథ్ తో బద్రి సినిమాలు చేసారు పవన్. వాటిలో తమ్ముడు హిట్ కాగా, బద్రి పెద్ద హిట్ గా నిలిచింది.
ఆపైన ఎస్ జె సూర్య తీసిన ఖుషి మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న పవన్, ఆ మూవీతో యువతలో ఎంతో గొప్ప క్రేజ్ దక్కించుకున్నారు. ఆ సమయంలో తిరుగులేని స్టార్డం అందుకున్న పవన్ తదుపరి జానీ సినిమా చేసారు. ఖుషి తరువాత రెండేళ్ల అనంతరం ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన జానీ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా బోల్తా కొట్టింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ సినిమాకి తొలిసారిగా పవర్ స్టార్ మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించారు.
రేణు దేశాయ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పవన్ తీసుకున్న పాయింట్ బాగున్నప్పటికీ దానిని తెరపై ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా తీయడంలో ఆయన విఫలం చెందారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే లవ్, ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ మూవీకి రమణ గోగులు అందించిన సాంగ్స్ శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. సినిమాలోని జానీ పాత్ర కోసం శారీరకంగా ఎంతో శ్రమపడి కొన్ని కేజీల బరువు తగ్గి నటించిన పవన్, చివరిగా ఫెయిల్యూర్ ని చవిచూడక తప్పలేదు. ఆ విధంగా జానీ సినిమా పరాజయం పవన్ కెరీర్ కి బాగా దెబ్బేసిందని చెప్పాలి. ఇక ఆ తరువాత గుడుంబా శంకర్, బాలు, బంగారం ఇలా వరుసగా పరాజయాలు చవిచూశారు పవన్.

మరింత సమాచారం తెలుసుకోండి: