దక్షిణ తెలుగు చిత్ర సీమ అగ్ర కథానాయిక... దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డేరింగ్ అండ్ డాషింగ్ విమెన్ జయలలిత గారి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం `తలైవి`. ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్- జయలలిత పాత్ర పోషిస్తుండగా తెలుగు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు.తమిళ డైరెక్టర్ ఏఎల్ విజయ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. తలైవి సినిమాను తమిళ్- తెలుగు- హిందీ భాషల్లో రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. విబ్రి మీడియా- కర్మ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. విశాల్ విఠల్ కెమెరామెన్ గా పని చేస్తున్నాడు.సెప్టెంబర్ 10న ఈ సినిమా విడుదల అవుతున్న సందర్భంగా అరవింద్ స్వామి మీడియాతో ముచ్చటించడం జరిగింది.

ఎంజీఆర్ అంటే అందరికీ ఎప్పటికి కూడా ఓ లెజెండ్. చిన్నప్పటి నుంచి కూడా ఆయన  సినిమాలు చూస్తూ పెరిగాను. సినిమాలలో ఇంకా రాజకీయాల్లో కూడా ఆయన ఎన్నో విజయాలు సాధించారు. అలాగే ఎంతోమంది ప్రజల అభిమానాన్ని ఆయన పొందారు. ఆయన పాత్రను పోషించడం నేను చాలా బాధ్యతగా ఫీలయ్యాను. డైరెక్టర్ విజయ్ సర్ నాకు ఆ పాత్రను ఆఫర్ చేయడం జరిగింది. అలాంటి లెజెండ్ పాత్రను పోషించడం నాకు చాలా చాలెజింగ్ అనిపించింది.. అందుకే నేను ఈ తలైవి సినిమాను చేశాను.నా పాత్ర ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో నా నట విశ్వరూపం చూపిస్తాను అని అరవింద స్వామి చెప్పాడు.ఇక ఈ సినిమాలో అరవిందస్వామి అటు ఎంజీఆర్ హీరోగా చేసిన పాత్రని ఇంకా రాజకీయ నాయకుడిగా చేసిన రెండు పాత్రలను చేశారట. ఆయన్ని మైమరిపించేలా అలాగే ప్రజలను ఆకట్టుకునే విధంగా బాగా కష్టమైన తన వంతు కృషి చేశానని అరవిందస్వామి చెప్పారు. ఇక చూడాలి అరవిందస్వామి ఎంజీఆర్ గా ఎలా మెప్పిస్తాడో..

మరింత సమాచారం తెలుసుకోండి: