తమిళ హీరో సూర్య కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది అని చెప్పడానికి 24 సినిమా యొక్క కలెక్షన్లే నిదర్శనం. గజిని సినిమా తో మొదలైన ఆయన తెలుగు ప్రయాణం ఎన్నో సినిమా లు వచ్చేలా అయ్యింది.  ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగు లోకి అనువదించగా సూర్య అన్ని సినిమాల లాగానే 24 సినిమా కూడా తెలుగు లో విడుదల చేసి ఒక్కసారిగా ప్రభంజనం సృష్టించాడని చెప్పవచ్చు. 13బి, మనం వంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను సరికొత్త లోకం లోకి తీసుకు వెళ్ళింది.

వెరైటీ కథనంతో విక్రమ్ కుమార్ తన మాయాజాలంతో ఈ సినిమా ను ఎంతో చక్కగా అల్లాడు. సూర్య త్రిపాత్రాభినయంలో నటించగా అందులో ఓ పాత్ర హీరో కాగా మరొకటి విలన్ పాత్ర ఇంకోటి విలన్ తమ్ముడి పాత్ర. హీరోగా అన్ని సినిమాల్లో కనిపించే సూర్య ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా తనకే సొంతమైన నటనతో ప్రేక్షకులను అలరించాడని చెప్పవచ్చు. ఇందులో సూర్య త్రిపాత్రాభినయం చేయడమే హైలైట్ అని చెప్పాలి. ఒక రాక్షస అన్న గా టైం ట్రావెలింగ్ వాచ్ ను కనిపెట్టే తమ్ముడిగా అలాగే అతని కొడుకుగా సూర్య మూడు పాత్రలలో డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ తో నటించాడు.

సైంటిస్ట్ గా మంచి పేరు తెచ్చుకోవాలని హీరో తండ్రి ఒక టైం ట్రావెలింగ్ చేసే వాచీ కనిపెడతాడు. దాన్ని ఎలాగైనా సొంతం చేసుకొని ఈ ప్రపంచాన్ని ఎలాలి అని సూర్య అనుకుని అతన్ని చంపడానికి కూడా వెనకాడకుండా చూస్తాడు. ఎలాగైనా  ఆ వాచీ సంపాదించాలని అతని ఇంటికి వెళ్ళి అతని చంపేసే క్రమంలో వీరు ఇద్దరు చనిపోతరు. హీరో తల్లి చనిపోతుంది. కానీ చిన్న పిల్లాడు అయిన హీరో మాత్రం బ్రతుకుతాడు. అలా హీరో వాచ్ మెకానిక్ గా జీవనం కొనసాగిస్తున్న సమయంలో తన తండ్రి కనిపెట్టిన వాచ్ గురించి అనుకోకుండా తెలుసుకొని దానిలోని పవర్ ను ఉపయోగించడం మొదలు పెడతాడు.  ఈ నేపథ్యంలోనే విలన్ ఆఖరి క్షణంలో బ్రతికి బయటపడగా తన తమ్ముడి కొడుకు దగ్గర నుంచి ఎలాగైనా వాచ్ ను వశం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తాడు. అలా చివరికి ఈ వాచ్ ఏ విధమైన పరిణామాలను తెచ్చిపెట్టింది అనేదే ఈ సినిమా కథ.

మరింత సమాచారం తెలుసుకోండి: